Germany Extends Lockdown: మళ్లీ లాక్ డౌన్ పొడిగించిన జర్మనీ … అక్కడ తాజా పరిస్థితికి అద్ధం పడుతుందా..?

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఏడాది పైగా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా యూరోపి దేశాలు ఈ కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఓ వైపు ప్రపంచ దేశాలు..

Germany Extends Lockdown: మళ్లీ లాక్ డౌన్ పొడిగించిన జర్మనీ ... అక్కడ తాజా పరిస్థితికి అద్ధం పడుతుందా..?
Follow us

|

Updated on: Jan 07, 2021 | 4:14 PM

Germany Extends Lockdown: చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఏడాది పైగా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా యూరోపియన్  దేశాలపై ఈ కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఓ వైపు ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ రన్ కు సిద్ధమవుతుంటే.. జర్మనీ మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమయింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించడానికి చాన్స్‌లర్‌ యాంజెలా మెర్కెల్‌ ఆమోదం తెలిపారు. కరోనావైరస్ కట్టడిలో భాగంగా జన సంచారంపై మరికొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నామని చెప్పారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కరోనా విజృంభణ అరికట్టడానికి న్యూ ఇయర్ వేడుకలపై కూడా నిషేధం విధించింది. అయినప్పటికీ అక్కడ రోజు రోజుకీ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

కాగా,జర్మనీలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇతర కేంద్రాలు నవంబర్ నుంచే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. అయినప్పటికీ కేసులు అదుపులోకి రావడం లేదని.. ఇక లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు సుమారు 14 లక్షల మంది కరోనాబాధితులు ఉండగా.. కరోనా 37,744 కరోనా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 8.3 కోట్ల జనాభా ఉండగా, సోమవారం వరకూ 2.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. దేశంలో గత ఏడాది నవంబర్‌ 2 నుంచి పాక్షిక లాక్‌డౌన్, డిసెంబర్‌ 16 నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జనవరి 10న లాక్‌డౌన్‌ ముగించాల్సి ఉండగా పొడిగించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న వాతావరణం. పరిస్థుతుల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించినట్లు తెలుస్తోంది.

Also Read: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రవాణాపై రాష్ట్ర మంత్రులతో హర్షవర్ధన్ సమీక్ష

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..