అమెరికాలో మ‌ర‌ణ శిక్షల‌‌ తీరు… నూత‌న అధ్య‌క్షుడు వ‌చ్చాక కీల‌క నిర్ణ‌యం ..!

నేరాల‌లో దోషులుగా తేలిన వారికి మ‌ర‌ణ శిక్ష‌ల విష‌యంలో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమ‌లు అవుతోంది. ఇక అమెరికాలో ప్ర‌స్తుతం దోషుల‌కు విధిస్తున్న మ‌ర‌ణ శిక్ష‌ల‌ను విష‌పు ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డం ద్వారా అమ‌లు అవుతోంది.

అమెరికాలో మ‌ర‌ణ శిక్షల‌‌ తీరు... నూత‌న అధ్య‌క్షుడు వ‌చ్చాక కీల‌క నిర్ణ‌యం ..!
Follow us

|

Updated on: Dec 13, 2020 | 12:20 PM

నేరాల‌లో దోషులుగా తేలిన వారికి మ‌ర‌ణ శిక్ష‌ల విష‌యంలో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమ‌లు అవుతోంది. ఇక అమెరికాలో ప్ర‌స్తుతం దోషుల‌కు విధిస్తున్న మ‌ర‌ణ శిక్ష‌ల‌ను విష‌పు ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డం ద్వారా అమ‌లు అవుతోంది. అయితే స‌కాలంలో కావాల్సిన విష‌పు ఇంజెక్ష‌న్లు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ మ‌ర‌ణ శిక్ష‌ల అమ‌ల్లో ఆల‌స్యం జ‌రుగుతోంది. ఈ క్రిస్మ‌స్ నుంచి మ‌ర‌ణ శిక్ష‌ల అమ‌లుకు ఇత‌ర ప‌ద్ద‌తుల‌ను కూడా అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్నారు. ఒక‌ప్పుడు ప‌లు దేశాలు అమ‌లు చేసిన ఎల‌క్ట్రిక్ చైర్‌కు బంధించి, గ్యాస్ చాంబ‌ర్‌లో నిర్బంధించి తుపాకుల‌తో కాల్చి చంపే విధానాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్నారు. న‌వంబ‌ర్ 27నే అమెరికా జ‌స్టిస్ విభాగం ఈ ప్ర‌త్యామ్నాయ ప‌ద్ద‌తుల‌ను తీసుకువ‌చ్చింది.

అమెరికా కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ జ‌న‌వ‌రి 20న ప్ర‌మాణ స్వీకారం చేసే నాటికి మ‌ర‌ణ శిక్ష‌లు అమ‌లు చేయ‌డంలో విష‌పు ఇంజెక్ష‌న్ల కొర‌త ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో అమెరికా న్యాయ విభాగం మ‌ర‌ణ శిక్ష‌ల అమ‌లుకు ఈ ప్ర‌త్యామ్నాయ మ‌ర‌ణ శిక్ష‌లు సూచించి ఉండ‌వ‌చ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2020, జనవరి నాటికి అమెరికాలో మరణ శిక్షలు పడి నిర్బంధంలో ఉన్న దోషులు 2,600 మంది కాగా, 2020, జూలై 14 నుంచి దేశ అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగే నాటికి అప్ప‌టి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 1550కిపైగా మ‌ర‌ణ శిక్ష‌ల‌ను అమ‌లు చేసింది.

గత జూలై 14వ తేదీ నుంచి దేశాధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం 1550కి పైగా మరణ శిక్షలను అమలు చేసింది. ట్రంప్‌ ఎన్నికల్లో ఓడిపోయాక బ్రాండెన్‌ బెర్నార్డ్‌ అనే 40 ఏళ్ల యువకుడికి గురువారం రాత్రి విషపు ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష విధించారు. చిన్న దోపిడీకే ఆ యువకుడికి మరణ శిక్ష పడింది. కిమ్‌ కర్దాషియన్‌ సెలబ్రిటీలు నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా విజ్ఞప్తులు చేసినా లాభం లేకపోయింది

ఇక ట్రంప్ ఎన్నిక‌ల్లో ఓడిపోయాక బ్రాండెన్ బెర్నార్డ్ (40) అనే వ్య‌క్తికి గురువారం రాత్రి విష‌పు ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డం ద్వారా మ‌ర‌ణ శిక్ష విధించారు. చిన్న దోపిడీకే ఆ యువ‌కుడికి మ‌ర‌ణ శిక్ష విధించారు. అయితే కిమ్ క‌ర్దాషియ‌న్ సెల‌బ్రీటీలు నిందితుడికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించాల్సిందిగా విజ్క్ష‌ప్తులు చేసినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది.

తాను అధికారంలోకి రాగానే ర‌ద్దు చేస్తా కాగా, అమెరికాలో అమ‌ల‌వుతున్న ఈ మ‌ర‌ణ శిక్ష‌లు వివాద‌స్ప‌దం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాను అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని ర‌ద్దు చేస్తాన‌ని నూత‌న అధ్య‌క్షుడు జో బైడెన్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార‌ణంగా ఆయ‌న వ‌చ్చేలోగా మ‌రో ఐదుగురికి మ‌ర‌ణ శిక్ష‌లు అమ‌లు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఇది వ‌ర‌కే సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

అయితే ఒక‌ప్పుడు అమెరికాలో మ‌ర‌ణ శిక్ష‌ల‌ను ఉరి తీయ‌డం ద్వారా అమ‌లు చేసేవారు. అందులో అమానుష‌త్వం ఉంద‌ని భావించి, 1936లో ఆ విధానానికి స్వ‌స్తి ప‌లికారు. అయితే కెంట‌కీలో రెయినీ బెతియా అనే వ్య‌క్తిని ఉరి తీసిన స‌మ‌యంలో ఆయ‌న వెన్నుపూస విరిగి తీవ్ర‌మైన న‌ర‌కం అనుభ‌వించ‌డంతో ఆ విధానం స‌రైంది కాద‌ని న్యాయ నిపుణులు భావించారు. ఆ త‌ర్వాత ఉరి బిగుసుకునేలా కాకుండా మెడ‌కు తాడు క‌ట్టి మెల్ల మెల్ల‌గా వేలాడ‌దీసేవారు. అలా న‌ల్ల జాతీయుల‌నే ఎక్కువ‌గా ఉరి తీశారు. 20 శ‌తాబ్దం ఆరంభం నుంచి మ‌ర‌ణ శిక్ష‌ల అమ‌లుకు ప్ర‌‌త్యామ్నాయ ప‌ద్ద‌తుల‌ను వెత‌క‌డం ప్రారంభించారు. తొలి అన్వేష‌న‌లోనే ఎల‌క్ట్రిక్‌చైర్ మ‌ర‌ణ శిక్ష‌ను అమ‌లు చేయ‌డం మంచిద‌ని భావించారు. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్నే అమ‌లు చేయ‌డం స‌రైన‌ద‌ని న్యాయ నిపుణుల బృందాలు సూచించారు. 1980 నుంచి ఈ విధానం అమెరికాల అంత‌టా కొన‌సాగింది.

అయితే 1990, 1997లో ఒక‌సారి శిక్ష అమ‌లులో ఎల‌క్ట్రిక్ చైర్‌లు అంటుకుని దోషులు మాడిపోవ‌డం వంటివి జ‌రుగ‌డంతో వివాద‌స్ప‌ద‌మైంది. ఇక ఆ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వ‌తంత్ర చ‌ట్టాలు చేసుకునే కొన్ని ప్ర‌త్యేక అధికారాలు కూడా ఉండ‌టంతో వ‌ర్జీరియా రాష్ట్రం 2013 వ‌ర‌కు కూడా దోషుల‌కు మ‌ర‌ణ శిక్ష‌లు అమ‌లులో ఈ విధానాన్నే అనుస‌రిస్తూ వ‌చ్చింది. ఇప్పుడు ఈ మ‌ర‌ణ శిక్ష అమ‌లు విధానం వివాద‌స్ప‌దం కావ‌డంతో నూత‌న అధ్య‌క్షుడు జో బైడెన్ వ‌చ్చాక ఈ విధానం ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంది.