US Gun culture: తెలుగు వాళ్ల ప్రాణాల మీదికొస్తున్న అమెరికా గన్‌ కల్చర్‌.. హెచ్చరిస్తోన్న ఎన్నారై సంఘాలు.

యూఎస్‌లో గన్‌కల్చర్‌... తెలుగోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. చదువుకోడానికెళ్లిన మనోళ్లు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది. నల్లదొంగలు తెగబడి తెలుగు విద్యార్థుల్ని బలితీసుకుంటున్నారు. చేతికో తుపాకీ చొప్పున అక్కడ చెలరేగిపోతున్న గన్‌ కల్చర్‌... ఎన్నారైల బతుకుల్ని..

US Gun culture: తెలుగు వాళ్ల ప్రాణాల మీదికొస్తున్న అమెరికా గన్‌ కల్చర్‌.. హెచ్చరిస్తోన్న ఎన్నారై సంఘాలు.
Us Gun Culture
Follow us

|

Updated on: Jan 24, 2023 | 8:20 PM

యూఎస్‌లో గన్‌కల్చర్‌… తెలుగోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. చదువుకోడానికెళ్లిన మనోళ్లు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది. నల్లదొంగలు తెగబడి తెలుగు విద్యార్థుల్ని బలితీసుకుంటున్నారు. చేతికో తుపాకీ చొప్పున అక్కడ చెలరేగిపోతున్న గన్‌ కల్చర్‌… ఎన్నారైల బతుకుల్ని శాసిస్తోంది. తాజాగా ఓ తెలుగు స్టూడెంట్‌ బతుకు ఇలాగే తెల్లారిపోయింది. అందుకే… ఇక్కడ నల్లదొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి ప్రవాస సంఘాలు. పెద్ద చదువులు, ఖరీదైన కొలువుల కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న వారి ఆశలు ఆవిరైపోతున్నాయి. అక్కడున్న వైట్స్ మీదే కాదు… బైటి దేశస్థుల్ని కూడా వదిలిపెట్టడం లేదు బ్లాక్స్. పెచ్చుమీరిపోతున్న తుపాకీ సంస్కృతికి తెలుగు విద్యార్థులు బలైపోతున్నారు.

తాజాగా చికాగోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తెలుగు విద్యార్థులపై నలుగురు నల్లజాతీయులు దాడి చేశారు. వారి దగ్గరున్న డబ్బు, ఫోన్‌ లాక్కున్నారు. అడిగినవన్నీ ఇచ్చినా వదిలిపెట్టకుండా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దెవ్‌శిష్‌ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరెంట్స్‌తో మాట్లాడుతుండగానే ఆఖరి శ్వాస విడిచాడు దేవ్‌శిష్. ఇదొక అంతులేని విషాదం. మరో విద్యార్థి సాయి చరణ్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 10రోజుల కిందటే అమెరికాకు వెళ్లిన సాయిచరణ్‌కు నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడ్డాడని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.

ఈ ట్రాజెడీ గురించిన విని అమెరికాలో ఉంటున్న తమతమ పిల్లల గురించి ఆందోళనకు గురవుతున్నారు పేరెంట్స్. ఎందుకంటే… అమెరికాలో సిగిరెట్ పాకెట్ కొన్నంత ఈజీగా తుపాకీ కొనెయ్యొచ్చు. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన గన్స్‌ని దోపిడీలకు, హత్యలకు వాడేయ్యడం వాళ్ల అలవాటుగా మారిపోయింది. విచ్చలవిడిగా పెరిగిన తుపాకుల వినియోగంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు అమెరికన్లు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న వార్తలతో అగ్రరాజ్యంలో ఇటువంటి అఘాయిత్యాలు ఇంకా పెరిగే ప్రమాదముంది. అందుకే… అక్కడున్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ఎన్నారై సంఘాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు