‘ సో ఫార్ సో గుడ్..’ రేపే స్పందిస్తా.. ఇరాన్ మిసైల్ దాడులపై ట్రంప్

ఇరాక్ లో అమెరికా వినియోగించే రెండు సైనిక స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినప్పటికీ  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగా స్పందించలేదు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల అనంతరం.. ‘ ఆల్ ఈజ్ వెల్..ఇరాక్ లోని మా రెండు మిలిటరీ స్థావరాలపై ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. ఈ ఘటనలో ఎవరైనా మరణించారా లేక గాయపడ్డారా అన్నదానిపై వివరాలు సేకరిస్తున్నాం.. సో ఫార్ సో గుడ్ ‘ అని ఆయన ట్వీట్ చేశారు. తమకు […]

' సో ఫార్ సో గుడ్..' రేపే స్పందిస్తా.. ఇరాన్ మిసైల్ దాడులపై ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 08, 2020 | 12:24 PM

ఇరాక్ లో అమెరికా వినియోగించే రెండు సైనిక స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినప్పటికీ  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగా స్పందించలేదు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల అనంతరం.. ‘ ఆల్ ఈజ్ వెల్..ఇరాక్ లోని మా రెండు మిలిటరీ స్థావరాలపై ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. ఈ ఘటనలో ఎవరైనా మరణించారా లేక గాయపడ్డారా అన్నదానిపై వివరాలు సేకరిస్తున్నాం.. సో ఫార్ సో గుడ్ ‘ అని ఆయన ట్వీట్ చేశారు. తమకు ప్రపంచంలోనే ఏ దేశానికీ లేనంత శక్తిమంతమైన సైనిక బలగం ఉందని, ఇరాన్ చర్యపై గురువారం ప్రకటన చేస్తానని ఆయన అన్నారు. మరోవైపు ఏ సమయంలోనైనా తాము దాడి చేసేందుకు సిధ్ధంగా ఉన్నామని. తగిన సమయంలో స్పందిస్తామని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అమెరికా  రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ కూడా..ఎందుకో తీవ్రంగా వ్యాఖ్యానించకుండా.. ఇరాన్ తో ఉద్రిక్తతలను తగ్గించాలన్న దానిపై దృష్టి పెట్టామని అన్నారు. ‘ ఆదేశంతో యుధ్ధం చేయాలన్న కోర్కె మాకు లేదు. అయితే సమయం వస్తే ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నాం ‘ అని ఆయన పేర్కొన్నారు. కానీ.. ఇరాన్ నుంచి ముప్పు పొంచిఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నామని.. ఇరాన్ తాను తీసుకున్న గోతిలో తానే పడవచ్చునని ఆయన పరోక్షంగా అన్నారు.

గత వారం తమ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం  సులేమాన్ అమెరికా డ్రోన్ దాడుల్లో మరణించడంతో ఇందుకు ప్రతీకారంగా తాము మిసైల్ దాడులకు దిగామని ఇరాన్ అంటోంది. మరింత ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఇరాక్ నుంచి అమెరికా తన సైనికబలగాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నట్టు ఇరాన్ అధికారిక టీవీ పేర్కొంది.