‘అక్రమ గ్రహాంతరవాసులను’ తరిమేస్తాం: డొనాల్డ్ ట్రంప్

, ‘అక్రమ గ్రహాంతరవాసులను’ తరిమేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అక్రమంగా అమెరికాలో చొరబడి.. ఇక్కడే నివాసముంటోన్న లక్షలాది మంది వలసవాదులను తరిమికొడతాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘అక్రమంగా అమెరికాలోకి చొరబడి ఇక్కడే ఉంటోన్న ‘ఈ అక్రమ గ్రహాంతరవాసులను’(అక్రమ వలసదారులను) వచ్చే వారం నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బయటకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అంటూ పేర్కొన్నారు. వారు ఎంత త్వరగా అమెరికాలోకి చొరబడ్డారో.. అంతే త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతారు అంటూ తెలిపారు.

అంతేకాకుండా వలసదారులు మెక్సికోలోకి చొరబడకుండా ఆ దేశం శక్తివంతమైన చట్టాలను తీసుకొచ్చిందని, అది చాలా మంచి చర్య ఆయన కితాబిచ్చారు. ఇక సేఫ్ థర్డ్ అగ్రిమెంట్‌కు గేట్‌మాలా దేశం సిద్ధమౌతోందని పేర్కొన్నారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ఏమీ చేయని వారు డెమోక్రంట్లు అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అమెరికాలో అక్రమ వలసదారుల లొసుగులను తొలగిస్తే.. సరిహద్దు సమస్యలకు చరమగీతం పలకొచ్చని ఆయన ట్వీట్ చేశారు. అయితే అమెరికాలో దాదాపుగా 12మిలియన్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *