అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే.. ఈ రిపోర్టు తప్పనిసరి.. విదేశీ రాకపోకలపై త్వరలో కొత్త నిబంధనలు..!

కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో మరికొద్దిరోజులపాటు కోవిడ్ ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే.. ఈ రిపోర్టు తప్పనిసరి.. విదేశీ రాకపోకలపై త్వరలో కొత్త నిబంధనలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 9:08 AM

US on international passengers : కరోనా మహహ్మరితో విలవిలలాడిన అగ్రరాజ్యాన్ని కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో మరికొద్దిరోజులపాటు కోవిడ్ ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనలు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారలు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

బ్రిటన్‌లో వెలుగుచేసిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాల్లోనూ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే అమెరికా కూడా యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కాగా, సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనున్నట్లు తెలుస్తోంది.

Read Also… అమెరికాకు హ్యాకర్ల సెగ.. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌పై సైబ‌ర్ నేర‌గాళ్లు భారీగా మాల్‌వేర్‌తో దాడులు..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన