అమెరికాలో బ్యాట్ మేన్ ప్రొటెస్ట్..!

అమెరికాలో ఓ నిరసనకారుడు బ్యాట్ మేన్ గెటప్ తో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు

అమెరికాలో బ్యాట్ మేన్ ప్రొటెస్ట్..!
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:34 PM

అమెరికాలో ఓ నిరసనకారుడు బ్యాట్ మేన్ గెటప్ తో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఫక్తు హాలీవుడ్ సినిమాల్లోలాగానే సెన్సేషన్ బ్యాట్ మేన్ కేరక్టర్ తో హల్ చల్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో నల్లజాతీయుల నిరసన ఆరో రోజుకు చేరింది. పోలీసుల దౌర్జన్యకాండను వ్యతిరేకంగా రాత్రి వేళల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోవడం నల్లజాతీయుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పోలీసులపై తిరగబడిన యువత పోలీసుల వాహనాలను తగలబెడుతున్నారు. ఎక్కడికక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయినా ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గట్లేదు. న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెల్స్‌లో టెన్షన్ వాతావరణం ఉంది. ఆందోళనకారులు షాపులను లూటీ చేస్తున్నారు. నిరసనకారులు చివరకు వైట్‌హౌస్ పైనా రాళ్లు విసిరి నిరసన తెలిపారు. హాలీవుడ్ సినిమాల్లోలాగానే నిరసనకారుడు బ్యాట్స్ మేన్ కస్ట్యూమ్స్ తో రావడం.. అదే సమయంలో ఆందోళనలు, పొగ, దుమ్ము అన్నీ సినీమాటిక్ లుక్ తెప్పించాయి. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాట్ మేన్ కేరక్టర్ మరోసారి టాక్ ఆఫ్ ది వాల్డ్ అయ్యింది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు