మేం విమర్శలు మాత్రమే చేస్తాం.. కేసులు పెట్టలేదు: కోడెల మృతి పై అంబటి

Kodela Sivaprasadarao Latest Updates, మేం విమర్శలు మాత్రమే చేస్తాం.. కేసులు పెట్టలేదు: కోడెల మృతి పై అంబటి

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన మృతికి టీడీపీనే కారణమని అంబటి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యను రాజకీయం చేయడం దారుణమన్నారు. కోడెల మృతిని జగన్‌కు ఆపాదించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి విమర్శించారు. కోడెలపై టీడీపీ నేతలే కేసులు పెట్టారు. కోడెల.. రాజకీయాల్లో రాటు దేలిన మనిషి.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి.. ఆయన కుటుంబసభ్యులు కూడా మరో కారణం అని అంబటి తెలిపారు. తాము రాజకీయ ప్రత్యర్థులమని కోడెలపై విమర్శలు మాత్రమే చేశాం.. అక్రమ కేసులు పెట్టలేదని అన్నారు. ఆయన మృతి వెనుక మిస్టరీ దాగి ఉందని అన్నారు.

మరోవైపు కోడెల మృతి విషయంలో టీడీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ఒకసారి హార్ట్‌ ఎటాక్‌ అని, మరోసారి ప్రమాదకర ఇంజక్షన్‌ చేసుకున్నారని, మూడోసారి ఉరివేసుకున్నారని భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. కోడెల ఆత్మహత్య పై పూర్తిస్థాయి విచారణ చేయాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. కోడెల కుటుంబానికి పార్టీ తరపున ప్రగాఢసానుభూతి తెలియచేస్తున్నామని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *