కెప్టెన్‌గా రాయుడు రీ ఎంట్రీ..హెచ్‌సీఏ కీలక నిర్ణయం

2019 ప్రపంచకప్‌కు ఎంపిక చేయనందున, భావోద్వేగ రిటైర్మెంట్‌ ప్రకటించి తిరిగి బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమైన తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు విజరు హజారే వన్డే టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబర్‌ 24 నుంచి బెంగళూర్‌లో జరుగనున్న దేశవాళీ వన్డే టోర్నీ విజరు హజారేలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును హెచ్‌సీఏ శుక్రవారం ప్రకటించింది. వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, సి.వి మిలింద్‌లు హైదరాబాద్‌ తరఫున ఆడనున్నారు. […]

కెప్టెన్‌గా రాయుడు రీ ఎంట్రీ..హెచ్‌సీఏ కీలక నిర్ణయం
Vijay Hazare Trophy 2019
Follow us

|

Updated on: Sep 14, 2019 | 2:37 AM

2019 ప్రపంచకప్‌కు ఎంపిక చేయనందున, భావోద్వేగ రిటైర్మెంట్‌ ప్రకటించి తిరిగి బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమైన తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు విజరు హజారే వన్డే టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబర్‌ 24 నుంచి బెంగళూర్‌లో జరుగనున్న దేశవాళీ వన్డే టోర్నీ విజరు హజారేలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును హెచ్‌సీఏ శుక్రవారం ప్రకటించింది. వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, సి.వి మిలింద్‌లు హైదరాబాద్‌ తరఫున ఆడనున్నారు. బి. సందీప్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

హైదరాబాద్‌ వన్డే జట్టు : అంబటి రాయుడు (కెప్టెన్‌), బి. సందీప్‌ (వైస్‌ కెప్టెన్‌), పి. అక్షత్‌ రెడ్డి, తన్మరు అగర్వాల్‌, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, రోహిత్‌ రాయుడు, సి.వి మిలింద్‌, మెహిది హసన్‌, సాకెత్‌ సాయిరాం, మహ్మద్‌ సిరాజ్‌, మికిల్‌ జైశ్వాల్‌, జె. మల్లికార్జున (వికెట్‌ కీపర్‌), కార్తీకేయ, టి. రవితేజ, అజరు దేవ్‌ గౌడ్‌. ( విక్రమ్‌ నాయక్‌, తనరు త్యాగరాజన్‌, అభిరాత్‌ రెడ్డి, ప్రణీత్‌ రాజ్‌, రాక్షణ్‌ రెడ్డి స్టాండ్‌బైలు ఎంపికయ్యారు)

ఆవేశ నిర్ణయం..అందుకే తిరిగి పునరాగమనం:

జులైలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు వార్తల్లో నిలిచాడు. రెండేళ్లు టీమిండియా తరుపున నిలకడగా ఆడిన రాయుడిని సెలక్షన్‌ కమిటీ వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో మూడు కోణాల్లో ఉపయోగపడతాడని విజయ్‌ శంకర్‌ను తీసుకుంది. దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. టోర్నీలో శిఖర్‌ ధావన్‌, శంకర్‌ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న అతడిని ఎంపిక చేయలేదు. పంత్‌, మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. భావోద్వేగానికి గురైన రాయుడు చివరికి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగానే అందరూ భావించారు. దీంతో హెచ్‌సీఏ రాయుడికి కీలక బాధ్యతలు అప్పగించింది. మున్ముందు అతడు భారత జాతీయ టీంలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.