Amazon Rainforest Fire : బ్రెజిల్‌‌లో ఎమర్జెన్సీ.. అమెజాన్‌లో ఆగని కార్చిచ్చు

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు ఇంకా ఎగిసిపడుతోంది. గత మూడు వారాలుగా వేల హెక్టార్ల అరణ్యం అగ్నికి ఆహుతవుతోంది. రికార్డు స్థాయిలో అమెజాన్ అడవులు కాలిపోతున్న తీరు సర్వత్రా ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. భూభాగంలో 20శాతం ఆక్సిజన్‌ను ఈ అడవుల నుంచే లభిస్తోంది. కార్చిచ్చు తగ్గకపోవడంతో.. బ్రెజిల్ దేశాధ్య‌క్షుడు బొల్స‌నారో.. అడువుల్లో మంట‌ల్ని అదుపు చేసేందుకు ఆర్మీని పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా పంపారు. స‌హ‌జ‌సిద్ధ‌మైన అమెజాన్ వ‌ర్షార‌ణ్యాన్ని ర‌క్షించుకునేందుకు బొల్స‌నారో చ‌ర్య‌లు మొదలుపెట్టారు. యురోపియ‌న్ నేత‌ల నుంచి […]

Amazon Rainforest Fire : బ్రెజిల్‌‌లో ఎమర్జెన్సీ.. అమెజాన్‌లో ఆగని కార్చిచ్చు
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 9:24 AM

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు ఇంకా ఎగిసిపడుతోంది. గత మూడు వారాలుగా వేల హెక్టార్ల అరణ్యం అగ్నికి ఆహుతవుతోంది. రికార్డు స్థాయిలో అమెజాన్ అడవులు కాలిపోతున్న తీరు సర్వత్రా ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. భూభాగంలో 20శాతం ఆక్సిజన్‌ను ఈ అడవుల నుంచే లభిస్తోంది. కార్చిచ్చు తగ్గకపోవడంతో.. బ్రెజిల్ దేశాధ్య‌క్షుడు బొల్స‌నారో.. అడువుల్లో మంట‌ల్ని అదుపు చేసేందుకు ఆర్మీని పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా పంపారు. స‌హ‌జ‌సిద్ధ‌మైన అమెజాన్ వ‌ర్షార‌ణ్యాన్ని ర‌క్షించుకునేందుకు బొల్స‌నారో చ‌ర్య‌లు మొదలుపెట్టారు. యురోపియ‌న్ నేత‌ల నుంచి తీవ్ర వ‌త్తిడి రావ‌డంతో బ్రెజిల్ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌కు శ్రీకారం చుట్టింది. అమెజాన్ అడువుల్లో మంట‌ల్ని ఆర్పితేనే లాటిన్ దేశాల‌తో వాణిజ్యం కొన‌సాగిస్తామ‌ని ఫ్రాన్స్‌, ఐర్లాండ్ దేశాలు అల్టిమేటం జారీ చేశాయి. దీంతో బ్రెజిల్ అధ్య‌క్షుడు కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దింపారు. అమెజాన్ అడ‌వుల్లో గ‌త కొన్ని రోజులుగా సుమారు 2500 ప్ర‌దేశాల్లో అగ్నికీల‌లు ఎగిసిప‌డుతూనే ఉన్నాయి.