Amazon Prime New plan: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతుండడంతో పోటీ బాగా పెరిగింది. దీంతో సదరు కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే…
Amazon Prime New plan: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతుండడంతో పోటీ బాగా పెరిగింది. దీంతో సదరు కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే రకరకాల ఆఫర్లు, ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన అమేజాన్ ప్రైమ్ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఇప్పటి వరకు అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నలుగురు యూజర్లు లాగిన్ అయ్యే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లలో అమేజాన్ ప్రైమ్ సేవలను పొందవచ్చు. అయితే తాజాగా అమేజాన్ ప్రైమ్ ప్రపచంలోనే తొలిసారి ఇండియాలో మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌తో కలిసి అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా తొలి 30 రోజులు ఉచితంగా ట్రయల్ అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత 28 రోజులకు రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్ వీడియోను మొబైల్లో చూసుకునే అవకాశంతోపాటు ఇదే ప్లాన్‌లో 6 జీబీ డేటా కూడా లభిస్తుంది. అమేజాన్‌లో ఇప్పటి వరకు ఉన్న ప్లాన్ నెలకు రూ.129, సంవత్సరానికి రూ.999గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్‌పై కేవలం ఒక్క యూజర్ మాత్రమే ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
Also Read: What’s App: సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..