భార‌త్‌లో ఆన్‌లైన్ ఫార్మ‌సీ: అమెజాన్‌

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో ఇంట‌ర్నెట్ ఫార్మ‌సీని ప్రారంభించింది. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా మందుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్ మెడిసిన్ మార్కెట్‌లో అమెజాన్ కొత్త ట్రెండ్ క్రియేట్

భార‌త్‌లో ఆన్‌లైన్ ఫార్మ‌సీ: అమెజాన్‌
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 12:00 PM

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో ఇంట‌ర్నెట్ ఫార్మ‌సీని ప్రారంభించింది. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా మందుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్ మెడిసిన్ మార్కెట్‌లో అమెజాన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయ‌నున్న‌ది. బెంగళూరులో అమెజాన్ ఫార్మ‌సీ అరంగేట్రం చేయ‌నుంది. ఆ త‌ర్వాత మిగితా న‌గ‌రాల‌కు ఇది విస్త‌రించ‌నున్న‌ది. భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఇటీవ‌ల అమెరికా టెక్నాల‌జీ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి.

కాగా.. ప్రిస్కిప్ష‌న్ ఆధారంగా అమెజాన్ ఫార్మ‌సీ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. కీల‌క‌మైన స‌మ‌యంలో క‌స్ట‌మర్లు ఇంటినుంచి త‌మ‌కు కావాల్సిన మందుల‌ను తెప్పించుకోవ‌చ్చు అని అమెజాన్ పేర్కొన్న‌ది. 2017లో ఫార్మ‌సీ రిటేల్ మార్కెట్‌లోకి అమెజాన్ ఎంట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత అమెరికాలో పిల్‌ప్యాక్ పేరుతో మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం మొద‌లుపెట్టింది. బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, కెన‌డా దేశాల్లోనూ ఆన్‌లైన్ ఫార్మ‌సీని అమెజాన్ స్టార్ట్ చేసింది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!