భారీ డిస్కౌంట్… రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల టీవీ రూ.29 వేలకే!

అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఎన్నో ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని ఆఫర్లు ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే ఇది అన్నిటికంటే అద్భుతమైన ఆఫర్. రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్ డీ టీవీ స్మార్ట్ టీవీ రూ.28,999కే అందుబాటులో ఉంది. 55 అంగుళాల మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆఫర్ ఇంకోటి ఉండదని చెప్పవచ్చు. ఈ టీవీ అమెజాన్ ప్రైమ్, నెట్ […]

భారీ డిస్కౌంట్... రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల టీవీ రూ.29 వేలకే!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 7:47 PM

అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఎన్నో ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని ఆఫర్లు ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే ఇది అన్నిటికంటే అద్భుతమైన ఆఫర్. రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్ డీ టీవీ స్మార్ట్ టీవీ రూ.28,999కే అందుబాటులో ఉంది. 55 అంగుళాల మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆఫర్ ఇంకోటి ఉండదని చెప్పవచ్చు. ఈ టీవీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఈరోస్ నౌ వంటి ఓటీటీ యాప్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇందులో ఉన్న ప్రధానమైన ఫీచర్ ఏంటంటే.. ఇది అమెజాన్ అలెక్సాను సపోర్ట్ చేస్తుంది. అంటే అలెక్సా ద్వారా మనం వాయిస్ కమాండ్స్ ఇస్తూ టీవీని నియంత్రించవచ్చు. ఇక మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. పైన తెలిపినట్లే ఈ టీవీ 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hzగా ఉంది. సెట్ టాప్ బాక్స్, బ్లూరే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్స్ ను కనెక్ట్ చేసుకోవడం కోసం మూడు హెచ్ డీఎంఐ పోర్టులు ఉన్నాయి. హార్డ్ డ్రైవ్ లు, ఇతర యూఎస్ బీ డివైస్ లను కనెక్ట్ చేసుకోవడానికి రెండు యూఎస్ బీ పోర్టులు కూడా ఉన్నాయి.

ఇంకా ఈ కంపెనీలోనే వేరే టీవీలు కావాలనుకుంటే.. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.13,499కి, 40 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.15,999కి, 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.21,999కి, 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ రూ.25,999కి, 65 అంగుళాల ఏఐ 4K అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ రూ.47,999కి లభించనున్నాయి. దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్లు దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. కాబట్టి సర్వీస్ విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.