Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

ఇండియాకు ఇస్తున్నాం 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలు.. జెఫ్ బెజోస్

Amazon hopes its electric vehicles will reduce carbon emissions and environmental impact of delivery operations, ఇండియాకు ఇస్తున్నాం 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలు.. జెఫ్ బెజోస్

క్లైమేట్ ఛేంజ్ ను ఎదుర్కొనేందుకు ఇండియాకు తాము 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలను అందజేస్తామని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. వీటిని లాంచ్ చేసిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్‌టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ హే ఇండియా ! వుయ్ ఆర్ రోలింగ్ ఔట్ న్యూ ఫ్లీట్ ఆఫ్ ఎలెక్ట్రిక్ డెలివరీ రిక్షాస్.. జీరో కార్బన్.. క్లైమేట్ ప్లెడ్జ్ ‘ అని కూడా అన్నారు. కాలుష్యాన్ని వెదజల్లని  ఇలాంటి సుమారు లక్ష వాహనాలను మరికొన్నేళ్లలో వీధుల్లో తిప్పాలన్నది ఆయన లక్ష్యమట. ఇవి 40 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ బయటకు రాకుండా నిరోధించగలుగుతాయని జెఫ్ భావిస్తున్నారు. తమ సంస్థ తయారు చేసిన ఈ ఎలెక్ట్రిక్ రిక్షాల తాలూకు వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు. 21 వ శతాబ్దం ఇండియన్ సెంచరీ అవుతుందని, 2025 సంవత్సరానికి భారతీయ ఎగుమతులు 10 బిలియన్ డాలర్ల మేర పెరగడానికి తమ సంస్థ తోడ్పడుతుందని అన్నారు.

జెఫ్ బెజోస్ సంస్థ తయారు చేసిన ఎలెక్ట్రిక్ వాహనాల్లో మూడు, నాలుగు చక్రాల మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు డిజైన్ల వాహనాలను ఇండియాలోనే తయారు చేయడం విశేషం. కార్బన్ కాలుష్యాలను ఇవి చాలావరకు తగ్గిస్తాయని అమెజాన్ కంపెనీ భావిస్తోంది. గత కొన్నేళ్లలో భారత దేశంలో ఎలెక్ట్రిక్ మొబైలిటీ ఇండస్ట్రీ పురోగతి సాధించిందని, దీనివల్ల టెక్నాలజీ మరింతగా పుంజుకోగలిగిందని అమెజాన్ అభిప్రాయపడింది. తాము తయారు చేసిన ఎలెక్ట్రిక్ రిక్షాలు ఈ ఏడాది ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, నాగపూర్, కోయంబత్తూరు సహా మొత్తం 20 నగరాల్లో ప్రవేశిస్తాయని ఈ సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని తెలిపింది.

Amazon hopes its electric vehicles will reduce carbon emissions and environmental impact of delivery operations, ఇండియాకు ఇస్తున్నాం 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలు.. జెఫ్ బెజోస్

కాగా … జెఫ్ బెజోస్.. ఇటీవలే ఇండియాను తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్‌తో సహా విజిట్ చేశారు. భారతీయ కుర్తాను ధరించి మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే ఆగ్రాను, ముంబైని కూడా సందర్శించారు. ముంబైలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో భేటీ అయ్యారు. ఇలా ఇండియాతో ఆయన తన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.

 

 

Related Tags