Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

నేనొచ్చా.. తలుపు తియ్యరే..

crocodile at door knocking, నేనొచ్చా.. తలుపు తియ్యరే..

మొసళ్లను దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది ఇంటి ముందరకే వస్తే… మన తలుపు మూసి ఉందని.. డోర్ తడితే ఏలా ఉంటుంది. ఊహించుకుంటేనే.. గుండెలు జారీపోతున్నాయి కదా. అయితే అలాంటి ఘటన ఒకటి దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇటీవలే బీచ్ సమీపంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అనంతరం షాపింగ్ కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ జరుగుతున్న ఘటనను చూసి షాక్‌కు గురైంది.

ఎందుకంటే ఆమె ఇంటి గుమ్మం ముందు ఓ నాలుగైదు అడుగులున్న మొసలి ఒకటి కనిపించింది. కనిపిస్తే సమస్య ఉండపొయేది.. కానీ అది నేనొచ్చాను.. డోర్ తీయండని చెప్పడానికి.. ఏకంగా డోర్ కాలింగ్ బెల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఈ తతంగాన్ని తన ఫోన్ లో రికార్డు చేసింది సదరు మహిళ. అనంతరం జంతు సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ చిలిపి మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.