వామ్మో.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!

వంట గదిలో అల్లం లేకుంటే అది వంటగదే కాదు. కేవలం కూరల్లో వినియోగించే అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీకావు. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రత్యేకతను ఎంతో గొప్పగా చెప్పారు.  అల్లం ప్రతిదినం క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు అనిర్వచనీయం. వంటకాల్లో అల్లం వేయకపోతే రుచి ఎలాగైతే ఉండదో.. ఆరోగ్యం విషయంలో కూడా అల్లం […]

వామ్మో.. చిన్న అల్లం ముక్క తింటే  ఇన్ని ఉపయోగాలా..!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 5:08 PM

వంట గదిలో అల్లం లేకుంటే అది వంటగదే కాదు. కేవలం కూరల్లో వినియోగించే అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీకావు. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రత్యేకతను ఎంతో గొప్పగా చెప్పారు.  అల్లం ప్రతిదినం క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు అనిర్వచనీయం. వంటకాల్లో అల్లం వేయకపోతే రుచి ఎలాగైతే ఉండదో.. ఆరోగ్యం విషయంలో కూడా అల్లం తీసుకోకపోతే అంత చేటుగా ఉంటుందన్నమాట.

అల్లం మంచి యాంటి ఆక్సీడెంట్. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో కీలకమైంది. స్వతహాగా అల్లం ఘాటు ఎక్కువగా ఉండి మంట పుట్టిస్తుంది. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది. షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.

ఇకపోతే సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమోఘంగా పనిచేస్తుందనే చెప్పాలి. విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోంటే సరి.. ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది. ఈ ఎఫెక్టివ్ రెమెడీ వెంటనే దగ్గును మాయం చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్ ని వెంటనే తొలగిస్తాయి. శ్వాస సంపూర్తిగా అందేందుకు సహకరిస్తుంది.

ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున క్రమం తప్పకుండా చిన్న అల్లం ముక్కను తింటే ఆ రోజుంతా ఎంత ఆరోగ్యంగా ఉంటారో చెప్పనక్కర్లేదు. మరికెందుకు ఆలస్యం.. ఈ చిట్కాను ఈ రోజే ప్రారంభించండి.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??