యాత్రికులపై “ఉగ్ర”గురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే…!

అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. కశ్మీర్ లోయ నుంచి వెంటనే భక్తులు ఖాళీ చేసేయాలని.. వెంటనే యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ డీజీపీ ప్రకటించారు. అటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఇవే ఆదేశాలను జారీ చేశారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని..ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు. యాత్ర మార్గంలో అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్ రెండురోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఐఈడీలు, ల్యాండ్‌మైన్లు, అమెరికన్ మేడ్ […]

యాత్రికులపై ఉగ్రగురి.. పాక్ ఏంచేసిందో తెలిస్తే...!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2019 | 10:46 AM

అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. కశ్మీర్ లోయ నుంచి వెంటనే భక్తులు ఖాళీ చేసేయాలని.. వెంటనే యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ డీజీపీ ప్రకటించారు. అటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఇవే ఆదేశాలను జారీ చేశారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని..ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు.

యాత్ర మార్గంలో అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్

రెండురోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఐఈడీలు, ల్యాండ్‌మైన్లు, అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్ లభ్యమవ్వడం సంచలనం సృష్టించింది. దీంతో భారత ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. కశ్మీర్‌లో లోయ మొత్తం జల్లెడ పట్టాలని అధికారులను ఆదేశించింది సర్కార్. టెర్రర్ గ్రూపులు లోయలో యథేచ్ఛగా తిరుగుతుండడంతో అలజడి రేగింది. ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసి.. ఆయుధాలను, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ తెలిపారు. ఇది పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులపనే అన్నారు.

యాత్రికులపై దాడికి పదిసార్లు ప్రయత్నించారు..

ఇప్పటికే టెర్రరిస్టులు పదిసార్లు దాడికి యత్నించినట్లు కాశ్మీర్ ఐజీ పాని తెలిపారు. మున్నాలాహోరీ, కమ్రాన్, ఉస్మాన్ వంటి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కశ్మీర్‌లో అలజడులు సృష్టించి.. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్నారు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్‌ సింగ్. ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న అన్ని ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని చూపించారు. అయితే ఈ ఐఈడీలు ఎలాంటివో పరిశీలిస్తున్నామని ఆర్మీ తెలిపింది. అయితే ఈ ఐఈడీలు, ల్యాండ్‌మైన్లలో పాకిస్థాన్ యాంటీ పర్సనల్ మైన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాదు.. అమెరికాకు చెందిన ఎమ్24 రైఫిల్‌ను కూడా ప్రదర్శించారు.

బలగాల మోహరింపు భద్రత కోసమే కానీ.. ఎలాంటి చర్యలకు దిగబోయేది లేదన్నారు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్. అయితే పాకిస్థాన్ చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని తెలిపారు. పాకిస్థాన్ ఇలానే ఉగ్రవాదులను భారత్ మీదకు వదిలితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్