మరింత ఉధృతంగా రైతుల పోరు.. సకల జనుల సమ్మెకు సై

ఆంధ్రప్రదేశ్‌ అమరావతి ప్రాంతంలోని రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు.. ఆందోళనకు దిగుతున్నారు. రాజధాని వికేంద్రీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 16 రోజులుగా అమరావతి అన్నదాతలు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైజాగ్‌లోని భీమిలి […]

మరింత ఉధృతంగా రైతుల పోరు.. సకల జనుల సమ్మెకు సై
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 7:50 AM

ఆంధ్రప్రదేశ్‌ అమరావతి ప్రాంతంలోని రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు.. ఆందోళనకు దిగుతున్నారు. రాజధాని వికేంద్రీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

16 రోజులుగా అమరావతి అన్నదాతలు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైజాగ్‌లోని భీమిలి ప్రాంతాన్ని రాజధానిగా చెబుతుండగా.. జ్యుడీషియల్‌ రాజధానిగా కర్నూలును మార్చాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో సకల జనులతో సమ్మెను ఉధృతం చేయాలనుకుంటున్న  రైతుల నిరసనలతో సర్కార్‌ ఏ మేరకు దిగివస్తుంది.. వారికి ఎలాంటి హామిని ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.

అత్యవసర సేవలు మినహా అన్ని వర్గాలు సమ్మెలో పాల్గొనాలని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు రైతులు. వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు దూరంగా ఉండి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. రాజధానికి డబ్బులు లేవంటే జోలి పట్టి నిధులు సమీకరిస్తామని.. రాజధాని తరలించొద్దంటున్నారు ఉద్యమకారులు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!