సినిమా కోసం నగ్నంగా అమలాపాల్..వైరల్ అవుతోన్న ‘ఆమె’ టీజర్

, సినిమా కోసం నగ్నంగా అమలాపాల్..వైరల్ అవుతోన్న ‘ఆమె’ టీజర్

తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకొంది సినిమాలకు గుడ్‌బై చెప్పింది క్రేజీ హీరోయిన్ అమలాపాల్.  కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి పూర్తిగా గ్లామర్ షోకి హద్దులు చెరిపేసింది. ఫోటో షూట్స్‌లో అందాలను ఆరబోసింది.  తాజాగా అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తమిళ్‌లో ఒక సినిమాను చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో కుమార్తె కనిపించడం లేదని పోలీసుకు ఓ తల్లి కంప్లైట్ చేయడం..పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఇలా ఒక్కో సన్నివేశాన్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా కోసం నగ్నంగా యాక్ట్ చేసింది అమలాపాల్..నిజంగా ఆమె చేసింది సాహసమే అని చెప్పాలి.

వెబ్ సీరీస్ లో నగ్నత్వం కామన్ అయిపోయింది కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం సంచలనమే. టీజర్‌లో ఎటువంటి  అసభ్యత  లేకుండా చూపించినా.. అమలా పాల్ ఇలాంటి సీన్‌లో చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలపాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడానికి నిజంగా ధైర్యం కావాలని ప్రశంసిస్తున్నారు.

ఈ టీజర్‌ను చూసిన సమంత అమల్ పాల్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది. ‘మీ ప్రేమ, అభిమానంతో మరో ప్రయాణం మొదలు పెట్టాను. మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు కావాలి. త్వరలో ‘ఆమె’ విడుదల కాబోతోంది’ అని అమలాపాల్‌ పేర్కొన్నారు. మరి అమలాపాల్ చేసిన ఈ వినూత్న ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *