తెలంగాణ కేబినెట్‌లో కరీంనగర్‌ హవా!

Along with KTR and Etela Karimnagar District has Four Minister in Telangana Cabinet, తెలంగాణ కేబినెట్‌లో కరీంనగర్‌ హవా!

తెలంగాణ కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించిన సీఎం కేసీఆర్… కొత్తగా మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్… వారికి శాఖలు కూడా కేటాయించారు. అయితే కేబినెట్ విస్తరణతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటివరకు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మంత్రులుగా ఉన్నారు. అయితే ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడానికి ఈటల, కొప్పుల ఈశ్వర్‌లలో ఎవరో ఒకరిని తప్పించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాకు చెందిన కేటీఆర్‌తో గంగుల కమలాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఎక్కువమంది ఉన్నట్టయ్యింది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పరిధిలో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీయడం కూడా సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమైందనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *