షాకిచ్చిన ఫేస్‌బుక్.. 27 కోట్ల యూజర్ల డేటా లీక్..!

దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లు కోకొల్లలు. అయితే కొద్దినెలలుగా ఎఫ్‌బీ టెక్నికల్‌ ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న డేటా లీక్ వ్యవహారంతో తలనొప్పులు తెచ్చుకున్న ఫేస్‌బుక్.. తాజాగా మరో వివాదంలో ఇరుకుంది. సుమారు 27 కోట్ల యూజర్ల డేటా ఆన్లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కంపారిటెక్ సెక్యురిటీ పరిశోధకుడు జాబ్ డయాచెంకో విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు 276 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల ఐడీలు, […]

షాకిచ్చిన ఫేస్‌బుక్.. 27 కోట్ల యూజర్ల డేటా లీక్..!
Follow us

|

Updated on: Dec 21, 2019 | 11:54 AM

దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లు కోకొల్లలు. అయితే కొద్దినెలలుగా ఎఫ్‌బీ టెక్నికల్‌ ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న డేటా లీక్ వ్యవహారంతో తలనొప్పులు తెచ్చుకున్న ఫేస్‌బుక్.. తాజాగా మరో వివాదంలో ఇరుకుంది. సుమారు 27 కోట్ల యూజర్ల డేటా ఆన్లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కంపారిటెక్ సెక్యురిటీ పరిశోధకుడు జాబ్ డయాచెంకో విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు 276 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల ఐడీలు, ఫోన్ నెంబర్లు, పేర్లు, ఇతరత్రా వ్యక్తిగత విషయాలన్నీ లీక్ అయ్యి.. ప్రస్తుతం హ్యాకర్ల ఫారం‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎఫ్‌బీలో ఉండే ఏపిఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్) సెక్యూరిటీ లోపం ద్వారా ఈ డేటా అంతా బహిర్గతం అయిందని ఆయన ఆరోపిస్తున్నారు.

మరోవైపు జాబ్ ఆరోపణలపై స్పందించిన ఫేస్‌బుక్.. డేటా లీక్ అంశంపై విచారణ చేపట్టామని.. భద్రతా విషయంలో మార్పులు చేస్తున్నామని స్పష్టం చేసింది. అంతేకాక ఇప్పుడు చోరీకి గురైన డేటా తమ సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరచకముందు జరిగి ఉండొచ్చని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.