‘బన్నీ ఆర్మీ’.. సొంత ఐడెంటిటీ కోసమేనా..!

మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆ ట్యాగ్‌తో అతడి ఎంట్రీ ఈజీగానే జరిగినా.. ఆ తరువాత హీరోగా, స్టైలిష్ స్టార్‌గా ఎదిగేందుకు బన్నీ పడ్డ కష్టం చాలానే ఉంది. సినిమా సినిమాకు తనను మార్చుకోవడంతో పాటు.. నటుడిగా ఎంతో పరిణతి సాధించిన అల్లు అర్జున్.. మిగిలిన ఇండస్ట్రీల్లోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరో అన్న బ్రాండ్‌తో ఉన్న బన్నీ.. ఇప్పుడు దాని […]

'బన్నీ ఆర్మీ'.. సొంత ఐడెంటిటీ కోసమేనా..!
Follow us

| Edited By:

Updated on: Jan 08, 2020 | 7:53 AM

మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆ ట్యాగ్‌తో అతడి ఎంట్రీ ఈజీగానే జరిగినా.. ఆ తరువాత హీరోగా, స్టైలిష్ స్టార్‌గా ఎదిగేందుకు బన్నీ పడ్డ కష్టం చాలానే ఉంది. సినిమా సినిమాకు తనను మార్చుకోవడంతో పాటు.. నటుడిగా ఎంతో పరిణతి సాధించిన అల్లు అర్జున్.. మిగిలిన ఇండస్ట్రీల్లోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరో అన్న బ్రాండ్‌తో ఉన్న బన్నీ.. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సొంత ఐడెంటిటీ కోసం బన్నీ ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అందుకే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరోలతో బన్నీ అంటీముట్టనట్లుగా ఉంటున్నాడని టాక్. ఇక తాజాగా జరిగిన అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ హీరోలెవ్వరు హాజరు అవ్వకపోవడంపై కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా ఈవెంట్ జరిగినా ఆ ఫ్యామిలీకి చెందిన ఒక్క హీరో అయినా వస్తుంటారు. కానీ నిన్నటి కార్యక్రమానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. ఓ వైపు రామ్ చరణ్ మరో ఈవెంట్‌ కోసం వెళ్లగా.. చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నా హాజరుకాలేదు(సరిలేరు నీకెవ్వరుకు చిరు వెళ్లడంపై బన్నీ కాస్త నొచ్చుకున్నట్లు కూడా టాక్). వీరే కాదు యంగ్ హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లలో కూడా ఒక్కరు కూడా అల ఈవెంట్‌కు రాలేకపోయారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించి వారు పెద్దగా మాట్లాడలేదు.

అయితే చిరు, త్రివిక్రమ్ మధ్య ఎప్పటినుంచో గ్యాప్ నడుస్తూ వస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాలో నటించేందుకు ఒకానొక సమయంలో చిరు ఆసక్తిని చూపినప్పటికీ.. ఆయన మాత్రం పెద్దగా ఇంట్రస్ట్‌ను చూపలేదట. ఇక చిరు, పవన్‌తో ప్రముఖ నిర్మాత టి.సుబ్బ రామి రెడ్డి మెగా మల్టీస్టారర్‌ను ప్రకటించి.. దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ చేసేందుకు కూడా త్రివిక్రమ్ కాస్త వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు చరణ్‌తో కూడా త్రివిక్రమ్ ఇప్పటివరకు ఓ సినిమాను తీయలేదు. దీంతో త్రివిక్రమ్‌పై చిరు ఎప్పటినుంచో కాస్త గుర్రుగా ఉన్నారట. అందుకే హైదరాబాద్‌లోనే ఉన్నా బన్నీ ఆడియో ఫంక్షన్‌కు రాలేదని తెలుస్తోంది(అయితే సరిలేరు నీకెవ్వరుకు అతిథిగా వెళ్లేందుకు చిరు ఒప్పుకోవడం వల్ల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వారు చిరును ఆహ్వానించలేదన్న టాక్ కూడా ఉంది).

ఇక మరోవైపు సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తోన్న బన్నీ.. నిన్నటి ఆడియో ఫంక్షన్‌లో సైతం అలానే మాట్లాడారు. స్పీచ్‌లో సినిమా గురించి, యూనిట్ గురించి ఆ తరువాత తన తండ్రి గురించి చెప్పి భావోద్వేగానికి గురైన బన్నీ.. చివర్లో మెగాస్టార్ గురించి ప్రస్తావించారు. ఇక అభిమానులు పవన్ పేరును పలుకుతుంటే.. మళ్లీ వివాదమెందుకులే అనుకున్నారో ఏమో తెలీదు గానీ.. తాను కూడా పవన్ కల్యాణ్ అంటూ ఓ చిన్న మాట అన్నారు. ఇలా అల్లు అర్జున్ స్పీచ్ మొత్తం మెగా ఫ్యామిలీ ప్రస్తావన పెద్దగా లేకుండా పూర్తైంది. అంతేకాదు తనకు ఆర్మీ ఉందంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. ఈ మాటలను బట్టి చూస్తుంటే మెగా ఫ్యామిలీకి బన్నీ దూరం అవుతున్నాడని, సొంత పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడటన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.