Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

సూపర్ స్టార్ వెర్సస్ స్టైలిష్ స్టార్.. సంక్రాంతి వార్‌‌కు సిద్ధం!

2019 సంక్రాంతితో పోలిస్తే.. 2020 పొంగల్ సీజన్‌కు పోటీ బాగా టఫ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండగా.. వాటిల్లో రెండు బడా చిత్రాలు పక్కాగా రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్లను విడుదల చేశాయి. అందులో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా కాగా.. మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ. ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆర్మీ మేజర్ లుక్‌లో మహేష్ అదరగొడుతుండగా.. మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌లో బన్నీ ఒక చేత్తో కోడిపుంజును పట్టుకుని.. వేరొక చేత్తో వేట కొడవలితో హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రెండు మూవీస్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్‌కు విశేషదారణ కూడా లభించింది. ఇక వీరిద్దరూ జనవరి 12వ తేదీని లాక్ చేసుకోగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా అటూ ఇటూగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళతో పాటుగా విక్టరీ వెంకటేష్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి సిద్ధం చేస్తున్నాడు. ‘ఎఫ్2’ మాదిరిగానే పండగ సీజన్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడువురా’ కూడా పండగ రేస్‌లోనే ఉంది. మరి ఈ పంచ్ పటాకాలో ఏ చిత్రం భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుంటుందో వేచి చూడాలి.