కాస్కో రాజా..! గెలుపు డేగదా..? నెమలిదా..?

ఈ ఏడాది సంక్రాంతి రెండు సినిమాలు పండుగ హీట్‌ను పెంచబోతున్నాయి. నువ్వా-నేనా అంటూ పందెంకోళ్లలా బరిలోకి దిగబోతున్నాయి.  మొదట ఒకేరోజు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్‌ను ప్రకటించి వార్ జోరును చూపించాయి. అయితే నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో.. ప్రస్తుతం మహేష్ బాబు 1 రోజు ముందుగా రావడానికి సర్దుబాటు చేసుకున్నాడు. కాకపోతే రెండు సినిమాలపై క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఫ్యాన్స్ మధ్య వార్ కూడా స్టార్ట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత మహేష్ […]

కాస్కో రాజా..! గెలుపు డేగదా..? నెమలిదా..?
Follow us

|

Updated on: Dec 11, 2019 | 3:23 PM

ఈ ఏడాది సంక్రాంతి రెండు సినిమాలు పండుగ హీట్‌ను పెంచబోతున్నాయి. నువ్వా-నేనా అంటూ పందెంకోళ్లలా బరిలోకి దిగబోతున్నాయి.  మొదట ఒకేరోజు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్‌ను ప్రకటించి వార్ జోరును చూపించాయి. అయితే నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో.. ప్రస్తుతం మహేష్ బాబు 1 రోజు ముందుగా రావడానికి సర్దుబాటు చేసుకున్నాడు. కాకపోతే రెండు సినిమాలపై క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఫ్యాన్స్ మధ్య వార్ కూడా స్టార్ట్ అయ్యింది.

చాలా రోజుల తర్వాత మహేష్ బాబు..సూపర్ యాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి వరుస హిట్స్‌తో ఎంత జోరమీద ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాలా..?. ఇప్పటికే రిలీజైన టీజర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్  హ్యాట్రిక్ హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద సింహనాదం చేయాలని చూస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్‌లో దూసుకుపోతున్న  రష్మిక మందనా మహేశ్‌తో జోడి కట్టగా, డీజే బ్యూటీ పూజా హెగ్డే బన్నీతో కలిసి నటించింది. ఇక సీనియర్ హీరోయిన్, లేడీ అమితాబ్ సరిలేరులో కీలక పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. మరోవైపు అందాల తార టబు కూడా వైకుంఠపురానికి స్ఫెషల్ అట్రాక్షన్ నిలువనుంది.

టాలీవుడ్‌లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న డీఎస్పీ..మహేశ్ సినిమాకి మ్యూజిక్ అందించాడు. బన్నీ మూవీకి ఇటీవల కాలంలో చెలరేగిపోతున్న తమన్..ట్యూన్స్ కట్టాడు. ఇప్పటికే ఈ సాంగ్స్ బయటకు వచ్చి యూట్యూబ్‌ వ్యూస్ విషయంలో నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.  దీంతో పోటీ పక్కా.. అన్న ఫీలింగ్ అర్థమైపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఒకరిపై మరోకరు కామెంట్స్ చేసుకుంటూ తమ హీరోదే ఆధిపత్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. సంక్రాంత్రికి ఎన్ని సినిమాలు వచ్చిన ఆదరించే సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉంది. లెట్స్ సీ ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువ అలరిస్తుందో.