”సిరి.. నువ్వు మా బాబాయ్‌వా”.. నవ్వులు పూయిస్తోన్న అల్లు అయాన్ వీడియో..!

తన తనయుడు అల్లు అయాన్, తనయ అర్హతో ఎప్పుడూ సరదా వీడియోలు చేస్తుంటారు అల్లు అర్జున్. వాటిని బన్నీ తరచుగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

''సిరి.. నువ్వు మా బాబాయ్‌వా''.. నవ్వులు పూయిస్తోన్న అల్లు అయాన్ వీడియో..!
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 10:08 PM

తన తనయుడు అల్లు అయాన్, తనయ అర్హతో ఎప్పుడూ సరదా వీడియోలు చేస్తుంటారు అల్లు అర్జున్. వాటిని బన్నీ తరచుగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా బన్నీ, అయాన్‌ మధ్య జరిగిన ఓ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయాన్ క్యూట్ మాటలతో వచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

ఆ వీడియోలో బన్నీ యాపిల్ వాచ్‌ పెట్టుకోగా.. దాని దగ్గరకు వెళ్లి ‘మీ పేరేమిటి’ అని అయాన్‌ అడుగుతాడు. దాని నుంచి సిరి అని సమాధానం రాగా.. నువ్వు మా బాబాయ్‌వా అని ప్రశ్నిస్తాడు. అందుకు సిరి మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదంటూ సమాధానం ఇస్తుంది. మళ్లీ బాబాయ్‌ అంటే అంకుల్ అని.. నువ్వు మా అంకుల్‌వా అని ప్రశ్నిస్తాడు అయాన్. అందుకు సిరి.. మీరు నన్ను ఫ్యామిలీలా భావిస్తే అలానే ఉంటాను అని చెప్తుంది. ఇక వెంటనే నీ పెళ్లెప్పుడు అని సిరిని అడుగుతాడు అయాన్. ఈ వీడియోను షేర్ చేసిన స్నేహ.. ఈ ప్రశ్నకు ఆపిల్ సిరి, అల్లు శిరీకి ఇద్దరి దగ్గరా ఆన్సర్ లేదు అని కామెంట్ పెట్టారు. కాగా ఈ వీడియో బన్నీ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

Read This Story Also: కరోనా విజృంభణ.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.!

https://www.instagram.com/p/CBIGHkll-tr/?utm_source=ig_embed

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..