Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Allu Arjun: బన్నీ కోసం స్పెషల్ టీమ్.. ఎందుకంటే..!

అల వైకుంఠపురములో చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. మార్చి నుంచి
Allu Arjun movie news, Allu Arjun: బన్నీ కోసం స్పెషల్ టీమ్.. ఎందుకంటే..!

అల వైకుంఠపురములో చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. మార్చి నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో బన్నీ పాల్గొనబోతున్నారు. ఆ లోపు మిగిలిన వారిపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సుకుమార్.

కాగా తన ప్రతి చిత్రంలో హీరోలను వైవిధ్యంగా చూపించే సుకుమార్.. ఈ మూవీలో బన్నీని ఇంతవరకు చూడని అవతారంలో చూపించబోతున్నారట. గుబురు గడ్డంతో బన్నీ కనిపించబోతున్నట్లు టాక్. ఇక బన్నీ లుక్‌ కోసం ముంబయి నుంచి ఓ టీమ్ హైదరాబాద్‌కు వచ్చిందట. ఆ టీమ్ బన్నీకి లుక్‌ మొదలుకొని కాస్ట్యూమ్స్, హెయిర్‌ స్టైల్ ఇలా అన్నీ డిజైన్ చేయనుందట. ఈ మేరకు ఇప్పటికే ఆ టీమ్ కొన్ని డిజైన్లను కూడా చేసుకొని సిద్ధంగా ఉండగా.. వాటిలో సుకుమార్ ఒక లుక్‌ను ఫైనల్ చేయనున్నారట.

ఇదిలా ఉంటే ఈ మూవీలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడబోతుండగా.. అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించే అవకాశం ఉందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: అల్లు అరవింద్, బన్నీల మధ్య రెమ్యూనరేషన్ సీక్రెట్స్..!

Related Tags