Breaking News
  • అమరావతి: ప్రకాశం జిల్లాలో పేదలకు కేటాయించాలని నిర్ణయించిన 1367 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని కోర్టుకి తెలిపిన ఏపీ ప్రభుత్వం. మైనింగ్ కు అనుకూలంగా లేవని పిటిషనర్ తండ్రి అఫిడవిట్ ఇచ్చారన్న ప్రభుత్వం. అఫిడవిట్ అవాస్తవమని ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ. విచారణలో భాగంగా ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం. ఈ నెల 13కి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.
  • కరోనాతో టిటిడి అర్చకుడు బీవీ శ్రీనివాసాచార్యులు మృతి. గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరుమలకు డిప్యుటేషన్ పై గతనెలల్లోనే వెళ్లిన శ్రీనివాసాచార్యులు. నాలుగురోజుల క్రితం కరోనాతో స్విమ్స్ లో చేరి ఇవాళ మృతి చెందిన శ్రీనివాసాచార్యులు.
  • చెన్నై : ఇండియన్ -2 సినిమా షూటింగ్ లో మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందచేసిన నటుడు కమలహాసన్ ,దర్శకుడు శంకర్ . ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన లో మృతి చెందిన ముగ్గురికి తలా నాలుగు కోట్లు నష్ట పరిహారం ప్రకటించిన ఇండియన్ -2 సినిమా బృందం . నటుడు కమల్ హాసన్ కోటి ,దర్శకుడు శంకర్ కోటి ,లైకా నిర్మాణ సంస్థ తరపున 2 కోట్లు నష్టపరిహారం గా అందజేత . భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సినీ పరిశ్రమలో ఉన్న అందరికి కమల్ విజ్ఞప్తి . భారతీరాజా ప్రారంభించిన కొత్త నిర్మాతల మండలి అయన సొంత ప్రయత్నమని ,సినీ పరిశ్రమకి ఎవరు మంచి చేసిన ఆధరిస్తానని కమల్ హాసన్ వెల్లడి.
  • ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ. Hpcl మరియు IOCL సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను నిర్వహించేందుకు నిర్ణయం. పెట్రోల్ పంప్ ఔట్లెట్ లనుప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తొలి ఔట్లెట్ ను జనగమలో ప్రారంభించామని మరో 5 ఔట్లెట్ లను 15 ఆగస్ట్ నాటికి ప్రారంభించనున్న ఆర్టీసీ. ఈ నిర్ణయం తో ఆర్టీసి కి 20.65 లక్షల అదనపు ఆదాయం వస్తోందని అంచనా.
  • కడప జిల్లా : వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ పై విడుదల అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి. మీ పై విడుదల అవుతున్న సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జెసి అనుచరులు అభిమానులు. తాడిపత్రి నుంచి భారీగా వచ్చిన జేసీ అనుచరులు.
  • కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోగ్యం నిలకడగా ఉంది. కరోనా చికిత్స కోసం ఆగస్టు 2 న మణిపాల్ హాస్పిటల్లో జాయిన అయిన రోజు నుంచి ఆయన ఆరోగ్యం గా నే ఉన్నారు. హాస్పిటల్ లో అతను సంతోషంగా ఉన్నారు. సీఎం యడ్యూరప్ప రూమ్ నుంచే అన్ని పాలన పరమైన కార్యకలాపాలు కూడా హాజరు అవుతున్నారు. మా వైద్యుల బృందం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు. డాక్టర్ మనీష్ రాయ్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్ బెంగళూరు.
  • చెన్నై : చెన్నై మహానగరం లో అమ్మోనియం నైట్రిట్ కలకలం . లెబనాన్ లో నిలువవుంచిన అమోనియం నైట్రైట్ పేలడం తో పదుల సంఖ్యలో మృతి ,వేల సంఖ్యా లో గాయాలు. ఇప్పుడు ఈ అమ్మోనియం నైట్రిట్ కి సంబంధించిన నిలువలు చెన్నై లో ఉండడం తో ఆందోళనలో మత్యకారులు. మనాలీ ఏరియాలో ఉన్న అమ్మోనియం నైట్రిట్ నిలువలపై కస్టమ్స్ అధికారులు వివరణ . మనాలీ లో సుమారు 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రిట్ నిలువ ఉందని ,దాని వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరణ .
  • బగ్గుమన్న బంగారం ధర. కొత్త రికార్డులు స`ష్టించిన గోల్డ్ రేటు . రూ 58,320 లకు చేరుతున్న పది గ్రాములు బంగారం . ఒక్కసారిగా రెండువేల రూపాయలకు పైగా పెరిగిన రేటు. ఈ వారంలోనే మూడు సార్లు పెరిగిన బంగారం ధర . మరో వారంలోనే 60 వేలకు చేరుకుంటుందనే అంచనాలు.

లుక్ కోసం చాలా కష్టపడ్డ బన్నీ.. ఎన్ని కేజీలు తగ్గాడంటే..!

Allu Arjun special diet for ala vaikuntapuramlo, లుక్ కోసం చాలా కష్టపడ్డ బన్నీ.. ఎన్ని కేజీలు తగ్గాడంటే..!

సినిమా సినిమాకు తనను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు న్యాయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతవరకు ఏ రెండు సినిమాల్లోనూ ఆయన ఒకే లుక్‌లో కనిపించలేదన్నది టాలీవుడ్ ఎరిగిన సత్యం. కాగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బన్నీ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ విషయం ఆ మధ్యన విడుదలైన టీజర్, పోస్టర్‌లలో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా అల వైకుంఠపురంలో మరింత స్టైల్ లుక్‌లో కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు బన్నీ.

అయితే ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేందుకు బన్నీ చాలా కష్టం పడ్డాడట. ముఖ్యంగా నా పేరు సూర్య సినిమా తరువాత కాస్త లావు అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కోసం కేటోజెనిక్ అనే స్పెషల్ డైట్‌ను చేశాడట. నాలుగు నెలల పాటు ఈ డైట్‌ను ఫాలో అయిన బన్నీ.. దాదాపు 14కిలోలు తగ్గాడట. ఇక హెయిర్‌ను కూడా కట్ చేయకుండా అలానే పెంచుకున్నాడట. అంతేకాదు ఫిట్‌నెస్ కోసం ఓ ట్రైనర్‌ను కూడా పెట్టుకున్న బన్నీ.. ఈ రోల్‌లోకి రావడం కోసం రోజూ రెండు గంటల పాటు చమటోర్చారట. సినిమా కోసం అంత కష్టపడుతాడు కాబట్టే.. బన్నీకి టాలీవుడ్‌, మాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్, నార్త్‌లో కూడా అత్యధికంగా ఫ్యాన్స్ ఉంటారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. టబు, రావు రమేష్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Tags