లుక్ కోసం చాలా కష్టపడ్డ బన్నీ.. ఎన్ని కేజీలు తగ్గాడంటే..!
సినిమా సినిమాకు తనను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు న్యాయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతవరకు ఏ రెండు సినిమాల్లోనూ ఆయన ఒకే లుక్‌లో కనిపించలేదన్నది టాలీవుడ్ ఎరిగిన సత్యం. కాగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బన్నీ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ విషయం ఆ మధ్యన విడుదలైన టీజర్, […]
సినిమా సినిమాకు తనను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు న్యాయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతవరకు ఏ రెండు సినిమాల్లోనూ ఆయన ఒకే లుక్‌లో కనిపించలేదన్నది టాలీవుడ్ ఎరిగిన సత్యం. కాగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బన్నీ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ విషయం ఆ మధ్యన విడుదలైన టీజర్, పోస్టర్‌లలో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా అల వైకుంఠపురంలో మరింత స్టైల్ లుక్‌లో కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు బన్నీ.
అయితే ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేందుకు బన్నీ చాలా కష్టం పడ్డాడట. ముఖ్యంగా నా పేరు సూర్య సినిమా తరువాత కాస్త లావు అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కోసం కేటోజెనిక్ అనే స్పెషల్ డైట్‌ను చేశాడట. నాలుగు నెలల పాటు ఈ డైట్‌ను ఫాలో అయిన బన్నీ.. దాదాపు 14కిలోలు తగ్గాడట. ఇక హెయిర్‌ను కూడా కట్ చేయకుండా అలానే పెంచుకున్నాడట. అంతేకాదు ఫిట్‌నెస్ కోసం ఓ ట్రైనర్‌ను కూడా పెట్టుకున్న బన్నీ.. ఈ రోల్‌లోకి రావడం కోసం రోజూ రెండు గంటల పాటు చమటోర్చారట. సినిమా కోసం అంత కష్టపడుతాడు కాబట్టే.. బన్నీకి టాలీవుడ్, మాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్, నార్త్‌లో కూడా అత్యధికంగా ఫ్యాన్స్ ఉంటారు.
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. టబు, రావు రమేష్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.