Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

బన్నీ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా!

Vijay Sethupathi In Talks For AA 20, బన్నీ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా!

‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు తెరకెక్కాయి. ఈ కొత్త సినిమా బన్నీ- సుక్కు కాంబోలో వచ్చే మూడో సినిమా. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్  మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ మరో ఎత్తు.. ఈ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా కోసం విలన్‌ అవతారమెత్తిన విలక్షణ నటుడు.. సుక్కు- బన్నీ సినిమాలో విలన్ రోల్ కోసం సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుక్కు నేరేట్ చేసిన కాన్సెప్ట్ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

Vijay Sethupathi In Talks For AA 20, బన్నీ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా!

ఇక విజయ్ సేతుపతి ఈ రోల్‌ను అంగీకరిస్తే మాత్రం.. బన్నీ- సుక్కు సినిమాకి తమిళనాట భారీ గిరాకీ దక్కుతుందనే చెప్పాలి. ఎర్ర చందనం స్మగ్లింగ్ అంతా తమిళనాడు బోర్డర్ లోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి విజయ్ సేతుపతిని విలన్ గా ఎంత ఖర్చు పెట్టి అయినా తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమా లాంచింగ్ ఇవాళ ఉదయం 9.36 నిమిషాలకు జరగనుంది

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Tags