Breaking News
  • చైనీస్ గేమింగ్ కేసుల్లో కొత్త కోణాలు . గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు . ఎస్ఆర్ నగర్ లో 6 లక్షలు , అదిలాబాద్ లో 15 లక్షలు పోగొట్టుకున్న యువకుడు సూసైడ్ . తాము కూడా లక్షలు పోగొట్టుకున్నామని సైబర్ క్రైమ్ కు క్యూ కడుతున్న బాధితులు . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్స్ ఫై సైబర్ క్రైమ్ పొలిసుల విచారణ . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ ల ద్వారా వస్తున్న రిఫెరల్ కోడ్ , ప్రెడిక్షన్ ల ఫై కేసు నమోదు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు . చైనా దేశస్థుడు యాహువో, దిల్లీకి చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌, నీరజ్‌ లను కస్టడీ తీసుకోనున్న పోలీసులు . బెట్టింగ్ యాప్ లో ద్వారా 110 కోట్లు వసూళ్లు . పెమా , మని ల్యాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక అంచనా . కంపెనీ డైరెక్టర్ ల లావాదేవీ ల ఫై ఈడీ కి లేక రాయనున్న సీసీఎస్ పోలీసులు.
  • చెన్నై : ప్రముఖ నటి నిక్కీగల్రనికి కరోనా సోకినట్టు నిర్ధారణ . తెలుగు తమిళ్ మలయాళం లో పలు చిత్రాలలో నటించిన నటి నిక్కీగల్రని. తనకు వైద్యపరీక్షల అనంతరం కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారని , ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తన ట్విట్టర్ లో వెల్లడి
  • తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం . తెలగాణలో 4259 మంది పోలీసులకు కరోనా . ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో 1946 మంది పోలీస్ ల కి కరోనా . తెలంగాణ వ్యాప్తం గా కరోనా తో 39 మంది పోలీసులు మృతి . హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో 26 మంది మృతి . పోలీస్ కరోనా కేసుల్లో హైద్రాబాద్ తర్వాత వరంగల్ , రాజన్న సిరిసిల్ల , నల్గొండ లో పోలిసులకు ఎక్కువ కరోనా కేసులు.
  • అమీన్పూర్ అనాధ ఆశ్రమంలో.. మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో కొత్త కోణం. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. మరోమైనర్ బాలికపై సైతం నిందితుడు వేనుగోపాల్ లైంగికదాడి. కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాకుల బెదిరింపులు. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంభందాలు. జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు. లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి. కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్. హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు. అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు. రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.
  • టాలీవుడ్ లో మరో పొలిటికల్ డ్రామా ఫిల్మ్ రూపొందుతోంది. నారా చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహాన్ని, రాజకీయ శతృత్వాన్ని తెరకెక్కిస్తున్నారు. "ఇంద్రప్రస్థం" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు దర్శకుడు దేవా కట్టా. రీసెంట్ గా కథా చౌర్యం వివాదంలో పడిన ఈ కథ ఇప్పుడు టాక్ ఆప్ ద టాలీవుడ్.
  • మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత వేసిన పిటిషన్ పై ఇవాళ నల్గొండ SC, ST కోర్టులో విచారణ.
  • స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీ కి కోరుతు కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. ముగ్గురు నుండి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కి ఇవ్వాలని విజయవాడ 3rd ఏసిఎమ్ఎమ్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితుల తరుపున న్యాయవాది.

అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

Allu Arjun Ala Vaikunthapurramulo Review, అల్లు అర్జున్‌  ‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

చిత్రం: అల వైకుంఠపురములో
రచన – దర్శకత్వం: త్రివిక్రమ్‌
నిర్మాత: అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు)
నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జయరామ్‌, సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌, సముద్రఖని తదితరులు
సంగీతం: తమన్‌.ఎస్‌.
కెమెరా: పి.యస్‌.వినోద్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాణం: గీతా ఆర్ట్స్, హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్
విడుదల: 12.01.2020
అల్లు అర్జున్‌ హీరోగా, త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉండబోతోంది?
తమన్‌ మ్యూజిక్‌ చేసిన పాటలేమో వందల మిలియన్ల లైకులు తెచ్చుకున్నాయి.. మరి సినిమాకు ఆ టాక్‌ వస్తుందా?
అటు బన్నీతో, ఇటు త్రివిక్రమ్‌తో పూజా హెగ్డే పని చేసిన గత చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఆ సెంటిమెంట్‌ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందా?…
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆదివారం ఆన్సర్‌ దొరికేసింది. ఏంటి ఆ ఆన్సర్‌? ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉంది? చదివేద్దాం…

Allu Arjun Ala Vaikunthapurramulo Review, అల్లు అర్జున్‌  ‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

కథ
రామచంద్ర (జయరామ్‌) దగ్గర క్లర్క్ గా పనిచేస్తుంటాడు వాల్మీకి (మురళీశర్మ). వాళ్లిద్దరి భార్యలకు ఒకే హాస్పిటల్‌లో ఒకే రోజు మగపిల్లలు జన్మిస్తారు. జయరామ్‌ భార్య అంజలి (టబు)కి పుట్టిన బిడ్డ కాసేపు ఉలకడు. పలకడు. దాంతో అక్కడున్న నర్సు (ఈశ్వరీ రావు) కంగారు పడుతుంది. ఆ విషయాన్ని వాల్మీకికి చెబుతుంది. వాల్మీకి కుటిల బుద్ధితో బిడ్డలను మారుస్తాడు. నర్సు కోమాలోకి వెళ్లడానికి కారణమవుతాడు. తన బిడ్డ యజమాని ఇంట్లో పెరగాలనుకుంటాడు. అక్కడ తన కుమారుడికి రాజు అని పేరు పెట్టించి, తన దగ్గర పెరిగే పిల్లాడికి బంటు అని పేరు పెడతాడు.
అయితే పాతికేళ్ల తర్వాత ఆ విషయం వాల్మీకి దగ్గర పెరుగుతున్న కొడుకు బంటు (అల్లు అర్జున్‌)కి తెలుస్తుంది. అప్పటికే రామచంద్ర కుటుంబానికి అమూల్య (పూజా హెగ్డే) ద్వారా పరిచయమై ఉంటాడు బంటు. రామచంద్ర కుమారుడిగా పెరుగుతున్న రాజు (సుశాంత్‌) గురించి తెలుసుకుంటాడు. అతనితో పాటు ఆ కుటుంబం ఉన్న పరిస్థితులను గురించి కూడా అర్థం చేసుకుంటాడు. తన తండ్రి రామచంద్ర(జయరామ్‌)ని ఇబ్బంది పెడుతున్న అప్పలనాయుడు (సముద్రఖని)తోనూ, అతని కుమారుడు పైడితల్లి (గోవింద్‌ పద్మసూర్య)తోనూ తలపడుతాడు. ఆ తర్వాత ఏమైంది? రామచంద్ర భార్య అంజలికి ఈ విషయమంతా తెలుసా? రామచంద్రకు, అంజలికి మధ్య ఉన్న మనస్పర్థలేంటి? వాల్మీకికి పాతికేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన అంశానికి ఫైనల్‌గా దొరికిన సమాధానం ఏంటి? వంటివన్నీ సస్పెన్స్.

ప్లస్‌ పాయింట్లు
– త్రివిక్రమ్‌ మాటలు
– పాటలు
– విజువల్స్
– నటీనటుల పెర్ఫార్మెన్స్
– కామెడీ

మైనస్‌ పాయింట్లు
– ఊహకు అందే కథ
– సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు

సమీక్ష
ఫస్ట్ నుంచీ కాన్పిడెంట్‌గానే ఉంది ‘అల వైకుంఠపురములో’ టీమ్‌. దానికి తోడు అల్లు అర్జున్‌ కాస్త గ్యాప్‌ తర్వాత వస్తున్నారు కాబట్టి ప్రమోషన్ల లోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. వీటన్నిటి కన్నా ముందు సినిమాపై అంచనాలు పెంచింది తమన్‌ మ్యూజిక్‌. ప్రతి పాటా విడుదలైన కొద్దీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయసాగింది. అలా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఉంది సినిమా. కథగా చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ అటు డబ్బున్న వాళ్ల ఇంట్లోనూ, ఇటు మధ్య తరగతి ఫ్యామిలీలోనూ ఉన్న ఎమోషన్స్ ని చాలా చక్కగా క్యాప్చర్‌ చేసే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్‌.
తన కొడుక్కి కచ్చితంగా ‘ఇలాంటి లక్షణాలు ఉంటాయి’ అని అనుకునే తండ్రి ఒకవైపు, ఎక్కడున్నా తన కొడుకు సుఖంగా ఉంటే చాలనుకునే తండ్రి మరో వైపు ఇందులో ప్రధానంగా కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో కొందరు ప్రలోభాలకు తలొగ్గుతారు. వాటి నుంచి బయటపడి, అయినవారికి దగ్గరయ్యే క్రమంలో వారితో మాటలకు కూడా నోచుకోరు. తప్పు చేసిన భర్త మనస్ఫూర్తిగా భార్యను క్షమించమని అడగటానికి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనే విషయాన్ని చాలా అందంగా చూపించారు త్రివిక్రమ్‌.
ఆయన డిజైన్‌ చేసిన బంటు కేరక్టర్‌కి అచ్చు గుద్దినట్టు సరిపోయారు అల్లు అర్జున్‌. అసలే స్టైలిష్‌ స్టార్‌… ఇంకాస్త స్టైలిష్‌ పెర్ఫార్మెన్స్, డ్యాన్సులతో స్క్రీన్‌ మీద ఫైర్‌ పుట్టించేశారు. ఫైట్లు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా డిజైన్‌ చేశారు. ప్రతి ఫైటూ బావుంది. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు స్క్రీన్‌ మీద చూడ్డానికి ప్లెజెంట్‌గా అనిపించాయి. పూజా హెగ్డే ఇంట్రడక్షన్‌ సీన్‌ మాస్‌కి ఫీస్టే. మురళీశర్మ కొత్త మ్యానరిజమ్‌తో కనిపించారు. తనికెళ్ల భరణి క్యారక్టర్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. అప్పల్నాయుడుగా సముద్రఖని పర్ఫెక్ట్ గా సరిపోయారు.
క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే గీతం కొత్తగా ఉంది. తెలుగు స్క్రీన్‌ మీద ఎవర్‌గ్రీన్‌ హిట్‌ కాన్సెప్ట్ సూపర్‌హిట్‌ సాంగ్స్ అంత్యాక్షరి. దాన్ని ఇందులో కొత్తగా వాడుకున్నారు. పవర్‌స్టార్‌, మెగాస్టార్‌ పాటలు, అక్కినేని, రాజశేఖర్‌ని ఇమిటేట్‌ చేసే షాట్స్ బావున్నాయి. ఫ్యాన్స్ ని కొట్టకూడదు అనే డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ వినిపించాయి. కెమెరా రిచ్‌గా కనిపించింది.
త్రివిక్రమ్‌ – బన్నీ గత చిత్రాలు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి… తండ్రి విలువను చెప్పినవే. ఈ చిత్రంలోనూ తండ్రి విలువను చెప్పారు. అంతకు మించి కొడుకు బాధ్యతను గుర్తు చేశారు త్రివిక్రమ్‌. కంటెంట్‌ ప్లస్‌ ప్లానింగ్‌ ఉన్న డైరక్టర్‌కి పర్ఫెక్ట్ హీరో దొరికితే సినిమా హిట్‌ ఖాయమని మూడో సారి ప్రూవ్‌ అయింది. పండక్కి ఎమోషన్స్ ఉన్న క్లాస్‌ మూవీ అల వైకుంఠపురములో..
ఫైనల్‌గా… అల వైకుంఠపురములో… స్టైలిష్‌గా ఉంది!
డా. చల్లా భాగ్యలక్ష్మి

Related Tags