మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సాక్షి మహారాజ్

భారతీయ జనతాపార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశానవాటికలు సమాజ జనాభా ప్రాతిపదికన ఉండాలని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:25 pm, Tue, 27 October 20

భారతీయ జనతాపార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశానవాటికలు సమాజ జనాభా ప్రాతిపదికన ఉండాలని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. బాంగర్‌మౌ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు మద్దతుగా ఉన్నవోలో జరిగిన బహిరంగ సభలో సాక్షి మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముస్లింలకు పెద్ద శ్మశానవాటికలు, హిందువుల దహనానికి పరిమిత స్థలం ఇది ఒక వివక్షత అని చెప్పడం వివాదాస్పదానికి దారితీసింది. ఒక గ్రామంలో ఒకే ఒక ముస్లిం ఉంటే, వారి శ్మశానవాటిక చాలా పెద్దది. ముస్లిమ్ మరణిస్తే అతన్ని పొలంలో లేదా గంగా నది వైపు దహనం చేయండి. ఒక్క ముస్లిమ్ కోసం పెద్ద శ్మశానవాటిక ఏర్పాటు చేయడం అన్యాయం కాదా? అందుకే శ్మశానవాటికలు జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి’’ అని ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం ఖననం, దహన మైదానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి మహారాజ్ వివాదాస్పద ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. మతాన్ని పరిరక్షించడానికి కనీసం నలుగురు పిల్లలను ఉండాలని జనవరి 7, 2015 న హిందూ మహిళలను కోరారు.