ఒక్క గాటుతో ముక్కలైన పుచ్చకాయ.. మరి.. అది మొసలి గురూ..!

Alligator Smashes Watermelon In A Single Bite

సాధారణంగా కొన్ని జంతువులను దగ్గరగా చూడాలంటే భయం కలుగుతుంది. కాని, అప్పుడప్పుడు అవి చేసే పనులు చూస్తే భలే ముచ్చటేస్తుంది. అలాంటి ఘటనే ఫ్లోరిడాలోని సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్‌లో జరిగింది. జూలో జంతువులను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి మొసళ్లను పెంచే సరస్సు దగ్గరకి వెళ్లి.. దానికి పుచ్చకాయ పెట్టేందుకు ప్రయత్నించాడు. కాసేపు దాని దగ్గరికి వెళ్లి ముందుకి వెనక్కి వెళ్లినట్లు చేశాడు. పుచ్చకాయను చూసిన మొసలి నీటిలో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించింది. అతడు పుచ్చకాయను వేయగానే నోటితో కరుచుకుని ఒక్క క్షణంలో ముక్కలు చేసింది. అక్కడే ఉన్న కొందరు దీన్ని చూస్తూ సంబరపడుతూ.. వీడియో తీసి ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. వీడియో షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *