Breaking News
  • అమరావతి: కరోనా నియంత్రణకు ప్రభుత్వ కీలక నిర్ణయం. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌లు, ఆస్పత్రుల ఉపయోగించుకోవాలని నిర్ణయం. ప్రైవేట్‌ ఆస్పత్రులు కలెక్టర్ల ఆదేశాలతో పనిచేయాలని ఉత్తర్వులు.
  • విజయవాడ: కరోనాపై యుద్ధానికి ప్రజలు సహకరించాలి. రేషన్‌ షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలి. రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు వికేంద్రీకరణ చేపట్టాం. అందరికీ రేషన్‌ సరఫరా చేస్తాం-జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత.
  • వలస కూలీలపై కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలన్న సుప్రీంకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా.
  • ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెరుగుతున్న కేసులు. మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి. ఓపీకి 100కు పైగా వచ్చిన బాధితులు.
  • కర్ణాటక లో వాట్సప్ వైద్య సేవలు. మంగళూరులో డేరలకట్టేలోని జస్టిస్ కె.ఎస్. హెగ్డే ఛారిటబుల్ హాస్పిటల్ వాట్సాప్ లో టెలి-మెడిసిన్ సేవలను ప్రారంభించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో రోగులకు వైద్య సలహాలను ఇవ్వడానికి వాట్సప్ సేవలు ప్రారంభం.

ఐపీఎల్‌ 2020: ఇకపై ఆ ‘రెండు’ నిబంధనలు.. థ్రిల్లింగ్ ఛేజింగ్‌లు..

All Set For Upgraded IPL 2020, ఐపీఎల్‌ 2020: ఇకపై ఆ ‘రెండు’ నిబంధనలు.. థ్రిల్లింగ్ ఛేజింగ్‌లు..

All Set For Upgraded IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 29 నుంచి మొదలుకానున్న ఈ టోర్నమెంట్‌.. క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాక ఈ కొత్త సీజన్‌లో సరికొత్త రూల్స్‌ను అమలు చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఐపీఎల్ క్రేజ్‌ను మరింత పెంచేందుకు పలు నిబంధనలను ఈ ఏడాది ఆచరణలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇక టైమింగ్స్ విషయంలో ఎటువంటి మార్పులు లేవు గానీ.. ఈసారి డబుల్ డెకర్ మ్యాచ్స్ కేవలం ఐదు మాత్రమే జరగనున్నాయి. అటు ఫైనల్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుందని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్తగా యాడ్ అవుతున్న అదనపు ఆకర్షణలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

1. ఆల్ స్టార్ గేమ్…

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా బీసీసీఐ ఆల్ స్టార్ గేమ్‌ను నిర్వహించనుంది. సరిగ్గా ఈ మ్యాచ్ టోర్నమెంట్ మొదలయ్యే మూడు రోజుల ముందు జరగనుంది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఈ మ్యాచ్ కేవలం ఛారిటీ కోసమే నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.

2.నో బాల్‌పై మూడో కన్ను…

ఈ ఏడాది ఐపీఎల్‌కు.. బీసీసీఐ నో బాల్స్‌పై సరికొత్త రూల్‌ను అమలు చేయనుంది. నో బాల్ పర్యవేక్షణ థర్డ్ అంపైర్‌దేనని ఐసీసీ ఒక రూల్‌ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఇక అదే రూల్‌ ఐపీఎల్ 2020లో కూడా అమలు కానుంది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో మలింగా వేసిన నో బాల్ ఎంతటి దుమారానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

3.కంకషన్ సబ్‌స్టిట్యూట్…

అంతర్జాతీయ మ్యాచుల్లో మాదిరిగానే ఐపీఎల్‌లో కూడా ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ అందుబాటులోకి రానుంది. ఏ ఆటగాడైనా గాయపడితే.. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయవచ్చు. ఇక ఈ నిర్ణయం మొత్తం మ్యాచ్ రిఫరీ చేతుల్లో ఉంటుంది.

4.ఉమెన్స్ టీ20 మ్యాచులు.. నాలుగు టీమ్‌లు సిద్ధం…

ఐపీఎల్‌కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టడానికి నాలుగు టీమ్‌లతో ఉమెన్స్ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గతేడాది కేవలం మూడు జట్టులు మాత్రమే ఉన్నాయి.. ఇక 2018లో అయితే సూపర్‌నోవాస్, ట్రయిల్‌బ్లాజెర్స్ టీమ్‌లు ఉండేవి.

5.మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్…

ఈ నిబంధనపై ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం దీన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. క్యాప్డ్ ప్లేయర్స్  లేదా ఇండియన్/ ఓవర్సీస్ ఆటగాళ్లకు లోన్ లేదా మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నారట. ఏది ఏమైనా ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌కు సరికొత్త ఫీల్‌ను కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Related Tags