రాజస్థాన్‌పై కోల్‌కతా ఘన విజయం

జైపూర్: ఆదివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు క్రిస్ లిన్ (50; 32 బంతుల్లో 6×4, 3×6), సునీల్ నరైన్ (47; 25 బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో.. కోల్‌కతా జట్టు 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే […]

  • Ravi Kiran
  • Publish Date - 9:24 am, Mon, 8 April 19

జైపూర్: ఆదివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు క్రిస్ లిన్ (50; 32 బంతుల్లో 6×4, 3×6), సునీల్ నరైన్ (47; 25 బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో.. కోల్‌కతా జట్టు 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే 5 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే మరోవైపు జోస్ బట్లర్ (37) కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడడంతో రాయల్స్ 6 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్ (73 నాటౌట్; 59 బంతుల్లో 7×4, 1×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.