Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • కర్ణాటకలో కరోనాకు బలవుతున్న ప్రజాప్రతినిధులు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు మృతి. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే. నిన్న మృతిచెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగాడి. అంగాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెలగావి (బెలగాం) కూడా కర్ణాటకలోనే అంతకు ముందు కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ మృతి.
  • సీఎం సతీమణి భారతి తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో తండ్రితో పాటు ఉన్న భారతిని.. అనవసరమైన వివాదాల్లోకి లాగుతున్నారు-మంత్రి కొడాలి నాని. తిరుపతికి సతీసమేతంగా సీఎం ఎందుకు రాలేదనడం బీజేపీ నేతలకు సమంజసమేనా. మచ్చలేని పరిపాలన అందిస్తున్న మోదీని వివాదాల్లోకి లాగడం.. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సమంజసమేనా-మంత్రి కొడాలి నాని.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • మహారాష్ట్ర: భివాండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో పూర్తయిన సహాయక చర్యలు.

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్

, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్

ఢిల్లీ : పుల్వామా ఘటనకు ప్రతికారంగా కేంద్ర ప్రభుత్వం పాక్ పై  కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఇలాంటి కవ్వంపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. దీనిపై ఇతర పార్టీనేతల సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ, కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌, ఎన్‌సీ నేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం, సీపీఐ నేతలు, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతలు రామ్మోహన్‌ నాయుడు, జితేందర్‌రెడ్డి, , ఎల్‌జెపీ నేత రాంవిలాస్‌ పాసవాన్‌లు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ హాజరయ్యారు.

 

Related Tags