Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు.  ఘటనకు సంబంధించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సీఎం జగన్​కు నివేదికను  అందజేసింది. ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పు. ప్రాజెక్టుకు "జగనన్న పల్లె వెలుగు" గా పేరు మార్చిన ప్రభుత్వం . ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశం.
  • తెలంగాణ లో 27వేల మార్కు దాటిన కరోనా కేసులు. హైదరాబాద్ లో 20వేలకు చేరవలో కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1879. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 27612. జిహెచ్ఎంసి పరిధిలో -1422. Ghmc లో 12,633 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో 7 మృతి . 313కి చేరిన మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 11,012. డిశ్చార్జి అయిన వారు -16287. ఈ రోజు వరకూ రాష్ట్రంలో టెస్టింగ్స్ 128438.

రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు

All part leaders call for khammam district bandh tomorrow, రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే అఖలపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బహిరంగ మద్దతు ప్రకటించాయి. మృతిచెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీ తమ సంతాపాన్ని తెలిపింది. కార్యాచరణలో భాగంగా ఈనెల 19న జరపనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు కూడా మద్దతునిచ్చింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మరికొన్ని డిమాండ్లతో జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధి నిర్వహణకు హాజరుకాని ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టే అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడపై ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహంతో పాటు తీవ్ర ఆవేదన కూడా రగిల్చింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి శనివారం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మ‌ృతి చెందారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికి నిరసనగా సోమవారం ఖమ్మం జిల్లా బంద్‌ను పాటించాలని జేఏసీ నేతలతో పాటు అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు.

Related Tags