Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ట్రాయ్ పేరు చెప్పి జియో దెబ్బ.. కొత్త టారిఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

All Jio users have to pay 6 paise per minute for outgoing calls: Here are all 4 plans with every data benefit, ట్రాయ్ పేరు చెప్పి జియో దెబ్బ.. కొత్త టారిఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

జియో… అన్ని ఇతర నెట్‌వర్స్‌‌‌కు ఉచితంగా కాల్స్, అపరిమిత ఇంటర్నెట్.. ఈ రెండింటితో అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు దగ్గర అయ్యింది. అయితే మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్స్‌కు అంతా ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది జియో. ఇక ఉచితంగా ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్ చేసుకునే సదుపాయానికి చెక్ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్టు రెండు రోజుల క్రితం పేర్కొంది. గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయాలంటే తక్కువలో తక్కువ పది రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ కొన్ని టాపప్ ఓచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లో భాగంగా వీటిని వసూలు చేయక తప్పడం లేదని పేర్కొంది. అయితే తొలుత ప్రకటనలో ట్రాయ్ ఒత్తిడి మేరకే చేస్తున్నట్లు ప్రకటించినా.. దీనిని ట్రాయ్ తప్పుబట్టింది. అయితే ఇప్పటి వరకు ఐయూసీ ఛార్జీలను జియోనే కట్టింది.

అయితే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి చేయించుకునే ప్రతీ పది రూపాయల టాపప్‌పై అదనంగా ఒక జీబీ డేటా ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు తరచూ కాల్ చేసే ఖాతాదారులు టాపప్‌లు చేయించుకుంటున్నారు. అయితే, జియో తాజాగా కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అక్టోబరు 9వ తేదీకి ముందు రీచార్జ్ చేసుకున్న ఖాతాదారులకు టాపప్ రీచార్జ్‌తో పనిలేదని ప్రకటించింది. వారంతా ఇతర నెట్‌‌వర్క్‌కు చేసే కాల్స్‌కు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, వారంతా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. వారి ప్లాన్ గడువు తేదీ ముగిసే వరకు ఇది వర్తిస్తుందని, ఆ తర్వాత మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

జియో ఐయూసీ మినట్స్ టాప్ అప్ వోచర్స్‌ ఇవే..

రూ.10తో చేసుకుంటే.. 124 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్‌ కాల్స్‌ చేసుకునేందుకు ) -1జీబీ డాటా ఉచితం
రూ.20తో చేసుకుంటే.. 249 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్‌ కాల్స్‌ చేసుకునేందుకు ) -2జీబీ డాటా ఉచితం
రూ.50తో చేసుకుంటే.. 656 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్‌ కాల్స్‌ చేసుకునేందుకు ) -5జీబీ డాటా ఉచితం
రూ.100తో చేసుకుంటే.. 1362 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్‌ కాల్స్‌ చేసుకునేందుకు ) -10జీబీ డాటా ఉచితం