Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘మా’లో మేమంతా సర్దుకున్నాం – రాజశేఖర్

గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏదో ఒక సమస్యపై తరచూ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  శివాజీరాజా ప్యానల్ ని నరేష్ ప్యానల్ పక్కా ప్రణాళికతో ఓడించింది. అందులో భాగంగా నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా జీవిత, రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల తర్వాత అంతా కలిసి పని చేస్తామని.. తమ మధ్య ఎటువంటి గొడవలు ఉండవని నరేష్ వెల్లడించారు.

అదేవిధంగా నిన్న జరిగిన ‘మా’ తొలి సర్వసభ్య సమావేశానికి నరేష్ ప్యానల్ తో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ‘మా’లోని సభ్యులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఫిల్మ్ నగర్ లో నటీనటుల సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందని చెప్పారు.

అనంతరం హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘శివాజీ రాజా, నరేష్‌లు కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు’. అందరి సమక్షంలో ఏర్పాటైన ఈ సమావేశం విజయవంతం అయిందని.. మేమందరం కలిసిపోయామని రాజశేఖర్ స్పష్టం చేశారు.