చంద్రయాన్-2 మిషన్.. పాక్షిక ‘ అంతరాయం ‘ పై ఫారిన్ మీడియా ఏమంది ?

just moments before its scheduled landing on, చంద్రయాన్-2 మిషన్.. పాక్షిక ‘ అంతరాయం ‘ పై ఫారిన్ మీడియా ఏమంది ?

చంద్రయాన్-2 మిషన్ లో చంద్రునికి దాదాపు దగ్గరగా వెళ్లిన విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చివరి క్షణంలో సంకేతాలు పంపకపోవడంపై ఫారిన్ మీడియా మిశ్రమంగా స్పందించింది. కొన్ని పత్రికలు దీన్ని భారత దేశ ఆశయాలకు దెబ్బగా అభివర్ణించగా .. మరికొన్ని..భారత అంతరిక్ష కార్యక్రమానికి ఇది విఘాతమని పేర్కొన్నాయి. ఇండియా తన ఈ మిషన్ ను విజయవంతంగా చేపట్టినప్పటికీ.. తాజాగా జరిగిన ఈ స్వల్ప వైఫల్యం పై ఆ దేశ అంతరిక్ష సంస్థ విశ్లేషించుకోవాల్సి ఉందని అమెరికన్ మ్యాగజైన్ ‘ వైర్డ్ ‘ తన ఆర్టికల్ లో అభిప్రాయపడింది. ఇది భారత రోదసీ కార్యక్రమంపై ప్రభావం చూపవచ్చు. అని ఈ మ్యాగజైన్ పేర్కొంది. అటు-భారత యువజనుల ఆశలపై నీళ్లు చల్లినట్టే అని వాషింగ్టన్ పోస్ట్ డైలీ వ్యాఖ్యానించింది. ఇది సక్సెస్ అయి ఉంటే అమెరికా, రష్యా, చైనా తరువాత ఇండియా నాలుగో దేశంగా అంతర్జాతీయంగా పేరు పొంది ఉండేదని తెలిపింది. న్యూయార్క్ టైమ్స్ కూడా దాదాపు ఇదే విధమైన వార్తను ప్రచురించింది. ఈ చిన్న ‘పొరబాటు వంటి దాని వల్ల భారత ఆశయాలు తీరడంలో మరింత జాప్యం జరగవచ్చునని ఈ డైలీ తెలిపింది. ఫ్రెంచ్ డైలీ ‘ లే మోండే ‘.. దీన్ని భారత చెదరిన కలగా తన వార్తలో రాసుకుంది. బ్రిటిష్ న్యూస్ పేపర్.. ‘ ది గార్డియన్ ‘.. చివరి క్షణంలో ఇండియా అంతరిక్ష కార్యక్రమానికి అంతరాయం కలిగిందని, ఇలా అయితే ఆ దేశం మరో 20 ఏళ్లకో, 50 లేదా, 100 ఏళ్లకో తన వ్యోమగాములను చంద్ర మండలానికి పంపే అవకాశం దక్కుతుందని వ్యంగ్యంగా పేర్కొంది. ఏమైనా.. ఫారిన్ మీడియాలో ఎక్కువ పత్రికలు, వెబ్ సైట్లు ఈ ప్రయోగంపై ఇండియా మీద కొంత అభిమానాన్ని, కొంత అక్కసును వెలిగక్కినట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *