ఆర్ బీ ఐ పరిధిలోకి అన్ని సహకార బ్యాంకులు.. కేంద్రం నిర్ణయం

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానాంశాలు .ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు  లోన్ కేటగిరీ వర్గాలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో సబ్-కేటగిరైజేషన్ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగం లోని 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 1482 అర్బన్-కో-ఆపరేటివ్ బ్యాంకులతో బాటు 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను […]

ఆర్ బీ ఐ పరిధిలోకి అన్ని సహకార బ్యాంకులు.. కేంద్రం నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 4:25 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానాంశాలు .ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు  లోన్ కేటగిరీ వర్గాలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో సబ్-కేటగిరైజేషన్ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగం లోని 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 1482 అర్బన్-కో-ఆపరేటివ్ బ్యాంకులతో బాటు 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్ బీ ఐ సూపర్ వైజరీ పవర్స్ కిందికి తేనున్నారు. ఎనిమల్ హజ్ బెండ్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసి… మూడు శాతం వడ్డీతో లబ్దిదారులను ఆదుకోవాలని నిర్ణయం. యూపీ లోని ఖుషినగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించారు.

కాగా-మంత్రివర్గ సమావేశానంతరం మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. దేశంలోని అన్ని కో-ఆపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. ఇండియాలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు.  పాస్ పోర్టు జారీ ప్రక్రియ ఇంకా సరళతరం కానుందన్నారు. మరో మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేటు పరిశ్రమలకు మార్గదర్శకాలను సూచించేందుకు, వాటిని ప్రోత్సహించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

‘ఇస్రో’ అతి ముఖ్యమైన సంస్థేనని, అయితే ఈ నూతన సంస్థ.. అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించి ‘విరామం’  కలిగితే. ఆ సమస్యను నివారించి  అవి కొనసాగేలా చూస్తుందని జితేంద్ర సింగ్ వివరించారు. లోగడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. భారత అంతరిక్ష కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ విధమైన సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కూడా ఆమె తెలిపారు.