Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

సీఏఎపై ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ‘సమరశంఖం’ !

All Congress States may pass resolutions against Caa, సీఏఎపై ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ‘సమరశంఖం’ !

సవరించిన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ పోరాటాన్ని తీవ్రం చేసే పనిలో పడబోతోంది. ఈ చట్టాన్ని అమలుచేయకపోవడం రాజ్యాంగ విరుధ్ధమేమీ  కాదన్న సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ సీఏఎకి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాలని సూచించింది. మొట్టమొదట పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభలో ఈ మేరకు తీర్మానాన్ని అందించింది. అందువల్లే ఇతర  అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలూ ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. పంజాబ్ తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలా తీర్మానాలను ఆమోదించాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ చట్టంపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని తాము కోరుతున్న సంకేతానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

సీఏఎని అమలు చేయజాలమని కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అశక్తతను వెలిబుచ్చిన నేపథ్యంలో కపిల్ సిబల్, జైరాంరమేష్ వంటి సీనియర్ నేతలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ చట్టంపై అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన  పక్షంలో  ఏ రాష్ట్రంకూడా దీన్ని అమలుచేయబోమని ప్రకటించజాలదని మొదట కపిల్ సిబల్ పేర్కొన్నారు. ‘ఇది సాధ్యం కాదు.. రాజ్యాంగ విరుధ్ధం కూడా.. తొలుత అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసి.. ఆ తరువాత దీన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరడమన్నది చిక్కులతో కూడిన వ్యవహారం ‘ అని ఆయన అన్నారు. అయితే ఈ చట్టం రాజ్యాంగవిరుధ్ధమని ఆయన ఆ తరువాత ట్వీట్ చేశారు. ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి  కూడా తీర్మానాన్ని ఆమోదించే రాజ్యాంగ హక్కు ఉందని, అదే సమయంలో దాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరవచ్చునని, ఇది రాజ్యాంగవ్యతిరేకమేమీ కాదని సిబల్ స్పష్టం చేశారు. కానీ ఈ చట్టం రాజ్యాంగబద్డమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు దీనిని వ్యతిరేకించడం సమస్యలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ ఏమైతేనేం ? ఫైట్ అలా కొనసాగుతుంటుంది ‘ అని కూడా సీనియర్ న్యాయవాది కూడా అయిన కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

 

Related Tags