Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

మూడు రోజుల పాటు తెలంగాణ సంబురాలు

Telangana Formation Day Celebrations, మూడు రోజుల పాటు తెలంగాణ సంబురాలు

ఆరు దశాబ్దాల పోరాటం.. అలుపెరగని ఆరాటం.. కొందరి బలిదానం.. వీటన్నింటి వల్లే ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. పార్లమెంట్‌లో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇక అదే సంవత్సరం జూన్ 2న దేశంలో 29వ నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఫలించగా.. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు తెలంగాణ 5వ అవతరణ దినోత్సవం జరుగుతుండగా.. అందుకోసం అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జూన్ 2న రవీంద్ర భారతిలో పోలీస్ పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేస్తుండగా… 3న సాంస్కృతిక కార్యక్రమాలు, 4న ఫిల్మోత్సవ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

 

 

 

 

Related Tags