కేసీఆర్ చింతమడకలో టూర్‌కి సర్వం సిద్ధం..

CM KCR Chinthamadaka Tour, కేసీఆర్ చింతమడకలో టూర్‌కి సర్వం సిద్ధం..

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డితో కలిసి చింతమడక గ్రామంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. చింతమడక గ్రామంలోని కుటుంబాల వారీగా సమగ్ర సమాచార సేకరణ పూర్తైందని హరీష్ రావు తెలిపారు. గ్రామంలో మొత్తం 596 ఇళ్లు, 874 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ, ఉద్యనవన, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల వారీగా సమగ్ర సర్వే పూర్తైందని ఆయన వెల్లడించారు.

వ్యవసాయశాఖ ద్వారా రైతుల గుర్తింపు, భూమిలేని వారి వివరాలు సేకరించినట్లు హరీష్ రావు తెలిపారు. గ్రామకార్శదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టామని, మొక్కలు నాటామన్నారు. నూతన రహదారుల నిర్మాణానికి అంచనాలు రూపొందించామని వివరించారు. ఇక గ్రామంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డిని అదేశించారు. ఆలయాలకు రంగులు, మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *