‘ ఆప్ ‘ కి అల్కా గుడ్ బై ! ఎందుకు ?

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి ‘ ప్రత్యేక ఆకర్షణ ‘ గా నిలిచిన ఎమ్మెల్యే అల్కా లాంబా ఇక పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ జవాబుదారీ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఈమెను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి నేతలు తొలగించారు. (ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎందులోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది..) కాగా-ఈ ఐదేళ్లూ తాను పార్టీలో కొనసాగానని, ఇది వచ్ఛే ఏడాది ముగుస్తుందని అల్కా లాంబా చెప్పారు. ఈ నగరంలో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ముందే తాను పార్టీ నుంచి నిష్క్రమిస్తానా లేక ఎన్నికల తరువాతా అన్న విషయాన్ని ఆమె స్పష్టం చేయలేదు. తలుపులు మూసేసి ఉన్న గదుల్లో (రహస్యంగా) కూర్చుని అన్ని నిర్ణయాలు తీసుకునే నాయకులపై చర్యలు తీసుకోవాలని అల్కా లాంబా పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాట్సాప్ గ్రూపు నుంచి తనను కొన్నిసార్లు తొలగిస్తారని, మళ్ళీ చేరుస్తారని, ఈ నేతల వైఖరి అంతుబట్టడంలేదని ఆమె పార్టీ నాయకత్వాన్ని దుయ్యబట్టారు. అందుకే ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అటు-గతంలో కూడా ఈమెను వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించి మళ్ళీ ఈమె పేరును చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *