అలీఘర్ ఘటన: ఆ కర్కశుడు సొంత కూతురినే అత్యాచారం చేశాడట

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల చిన్నారి ట్వింకిల్ దారుణ హత్య కేసును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నిజాలను రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులలో ఒకడు ఐదేళ్ల క్రితం సొంత కుమార్తె మీద అత్యాచారం చేశాడట. ఆ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటికొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే ట్వింకిల్ కుటుంబ సభ్యులు తమ దగ్గర తీసుకున్న రూ.10వేల అప్పు ఇవ్వడం లేదంటూ ఈ నెల 30న ఆ బాలికను నిందితులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత దారుణంగా హత్య చేసిన వారు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చెత్త కుండీలు వేశారు. ఆ ముక్కలను కుక్కలు లాగడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన నిజాలు తెలుస్తున్నాయి.

ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే తమ కూతురి ప్రాణాలు పోయాయని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం ఒక ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జాహిద్‌, అస్లాం అని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *