ఏలియన్స్..? యూఎఫ్ఓ..? ఆ మెరిసే లైట్ల వెనుక కథేంటి..!

ఏలియన్స్‌, యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) వీటి గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని ఎంతోమంది శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే వాటి గురించిన సమాచారం మాత్రం ఇప్పటికీ వారు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్వీడన్ దేశంలో ఆకాశంలో ఓ వింత కనిపించింది. స్వీడన్‌లోని అబిస్కోలో శనివారం ఉదయం కొన్ని వెలుగులు ఆకాశంలో కనిపించాయి. ఆకాశంలో రెండు స్థానాల్లో అవి దర్శనమిచ్చాయి. వీటిని ప్రముఖ ఫొటోగ్రాఫర్ చాద్ బ్లాక్లీ తన కెమెరాలో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ […]

ఏలియన్స్..? యూఎఫ్ఓ..? ఆ మెరిసే లైట్ల వెనుక కథేంటి..!
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 4:24 PM

ఏలియన్స్‌, యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) వీటి గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని ఎంతోమంది శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే వాటి గురించిన సమాచారం మాత్రం ఇప్పటికీ వారు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్వీడన్ దేశంలో ఆకాశంలో ఓ వింత కనిపించింది. స్వీడన్‌లోని అబిస్కోలో శనివారం ఉదయం కొన్ని వెలుగులు ఆకాశంలో కనిపించాయి. ఆకాశంలో రెండు స్థానాల్లో అవి దర్శనమిచ్చాయి. వీటిని ప్రముఖ ఫొటోగ్రాఫర్ చాద్ బ్లాక్లీ తన కెమెరాలో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

https://www.facebook.com/lightsoverlapland/posts/2387701944587651

‘‘రాత్రిపూట ఆకాశంలోని వింతలను బంధించే అరోరా వెబ్ కెమెరాలో వీటిని మొదట గమనించాను. తరువాత వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయా. ఇది ఒక వింత’’ అంటూ బ్లాక్లీ కామెంట్ పెట్టాడు. దీంతో ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అవి ఏలియన్స్ అని కొందరు, యూఎఫ్ఓ అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇంకొందరైతే ఇది ఫొటోషాప్ అంటూ కొట్టిపారేశారు. అయితే ఈ మిస్టరీ లైట్లపై అందోయ అంతరిక్ష కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. అవి మిస్టరీ లైట్లు కాదని, ఒక ప్రయోగానికి సంబంధించిన లైట్లని ఆ సంస్థ వెల్లడించింది.

‘‘నాసా సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామ్ ఆఫీస్, అందోయ స్పేస్ సెంటర్ కలిసి అజుర్(AZURE-ద ఆరోరల్ జోన్ అప్‌వెల్లింగ్ రాకెట్ ఎక్పరిమెంట్) ప్రయోగాన్ని చేశాయి. ఆ ప్రయోగంలో నిమిషాల వ్యవధిలో రెండు సౌండింగ్ రాకెట్లను అంతిరిక్షంలోకి పంపాం. కొంత ఎత్తుకు వెళ్లిన తరువాత ఆ రాకెట్లు మెటాలిక్ పౌడర్‌ను వాతావరణంలోకి విడుదల చేశాయి. అరోరా బొరైల్స్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేశాం’’ అంటూ దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరోవైపు దీనిపై నాసా కూడా స్పందించింది. ‘‘అజుర్ మిషన్ విజయవంతమైంది. ఈ రాకెట్లు ఆకాశంలో ఓ కలర్ షోను ప్రదర్శించాయి. భూమి ఐనోస్పియర్‌లోని న్యూటర్, చార్జ్‌డ్ పార్టికల్స్‌పై పరిశోధన చేసేందుకు ఇవి దోహదపడతాయి’’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో అందరి అనుమానాలకు సమాధానం దొరికినట్లైంది.