‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో పాట పాడనున్న అలియా..!

రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'‌. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ నటి అలియా భట్‌ కనిపించనుంది.

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో పాట పాడనున్న అలియా..!
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2020 | 2:44 PM

RRR Movie Gossips: రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ నటి అలియా భట్‌ కనిపించనుంది. ఇక లాక్‌డౌన్ బ్రేక్ తరువాత ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభం కాగా.. నవంబర్ నుంచి అలియా ఇందులో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో అలియా ఓ పాట పాడబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అలియాపై ఒక ప్రత్యేకమైన పాట ఉండగా.. దాన్ని ఆమెనే పాడబోతున్నట్లు సమాచారం. హైవే, హంప్టీ శర్మ కీ దుల్హానియా చిత్రాల్లో పాటలు పాడి ఇప్పటికే సింగర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది అలియా. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కూడా ఆమె మరోసారి గాత్రాన్ని సవరించుకోబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. (హైదరాబాద్‌కి రానున్న ‘రాధే శ్యామ్’‌ టీమ్‌..!)

కాగా రియల్‌ కారెక్టర్స్‌తో ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ( మహేష్‌, పూరీలను కలపబోతున్న ఆ నిర్మాత..!)