అలీకి చిక్కిన ‘లక్’?.. వైల్డ్ కార్డు ఎంట్రీతో.?

Ali Reza To Enter Bigg Boss As Wild Card Entrant, అలీకి చిక్కిన ‘లక్’?.. వైల్డ్ కార్డు ఎంట్రీతో.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారం కొనసాగుతోంది. ట్విస్టులు, రొమాన్స్, తగాదాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తూ.. హై టీఆర్పీ రేటింగ్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ రెజాలు బయటికి వెళ్లిపోయారు.

ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ మొదటి రెండు సీజన్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. షోలోకి 11వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన వారందరూ చివరికి విన్నర్స్‌గా బయటికి వచ్చారు. మొదటి బిగ్ బాస్ సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా శివ బాలాజీ అడుగుపెట్టి.. విన్నర్‌గా నిలవగా… రెండో సీజన్‌లో కౌశల్ మందా 11వ కంటెస్టెంట్‌గా అనూహ్యంగా భారీ మెజార్టీతో విజయడంఖా మోగించాడు. ఇక ఈ సీజన్‌లో 11వ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా బిగ్ బాస్ విన్నర్‌ అవుతాడని అనుకుంటే.. ఊహించని విధంగా మొన్నటివారం ఎలిమినేషన్ ఎదుర్కొని.. హౌస్ నుంచి బయటికి వచ్చాడు. దీనితో ’11’ సెంటిమెంట్ మటాష్ అయిందని అనుకోవచ్చు. కానీ అలీ రెజా మూడో సీజన్‌లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అన్ని టాస్క్‌లలోనూ చురుగ్గా పాల్గొంటూ తెలివిగా గెలిచేవాడు. అతన్ని ఎలిమినేట్ చేసినప్పుడు కూడా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆనవాయితీ ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. కాబట్టి రెండు వారాల్లో మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీగా అలీ రెజా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *