Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

బిగ్ బాస్: ఫస్ట్ నామినేషన్.. అదే ఎలిమినేషన్!

Ali Reza Out Of Bigg Boss Telugu, బిగ్ బాస్: ఫస్ట్ నామినేషన్.. అదే ఎలిమినేషన్!

బిగ్ బాస్.. కోపాలు, తాపాలు, నవ్వులు, అలకలు, అరుపులు, రొమాన్స్‌లతో ఇంటరెస్టింగ్‌గా సాగిపోతోంది. ఒకవైపు టాస్కులు.. వారం గడిస్తే నాగార్జున క్లాసులు.. అంతేకాకుండా ఎలిమినేషన్ ఒకటి. ఇది టోటల్‌గా బిగ్ బాస్ తీరు. ఇక ప్రతివారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయింది.

నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఇలా ఐదు వారాలు ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోవారం కూడా ఒకరు బయటికి వస్తారని అందరూ ఊహించుకుంటే.. అనూహ్యంగా ఆ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఎత్తేశారు. ఇక యధావిధిగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు అప్పుడే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఫస్ట్ టైం ఎలిమినేషన్ నామినేషన్‌లోకి వచ్చిన అలీ రెజా.. ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ది బెస్ట్ కంటెస్టెంట్ అని పేరున్న అలీకి టెంపర్, అగ్రెసివ్‌నెస్ ఎక్కువ. ఇక ఈ కారణాల వల్లే అలీ రెజాకు ఓట్లు తక్కువగా పడినట్లు తెలుస్తోంది. కాగా ఫస్ట్ సీజన్‌లో కూడా ప్రిన్స్ ఫస్ట్ టైం ఎలిమినేషన్స్‌లో వచ్చిన వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.

అటు కింగ్ నాగార్జున స్పెయిన్ పర్యటన ముగించుకుని బిగ్ బాస్‌లోకి వచ్చేశారు. క్రిందటి వారం నాగ్ ప్లేస్‌లో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాగ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఆరోవారం ఎలిమినేషన్స్ తీసేశారు. అటు వైల్డ్ కార్డు ఎంట్రీగా యాంకర్ శిల్ప చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది.

Related Tags