మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..

ఏపీలో మద్య పానం మరింత ప్రియం కానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గకుండా.. గతేడాది కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే ధరలు పెంచడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఉన్న ధరలను 10 […]

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 12:33 PM

ఏపీలో మద్య పానం మరింత ప్రియం కానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గకుండా.. గతేడాది కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే ధరలు పెంచడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఉన్న ధరలను 10 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనివల్ల ఉత్పత్రిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాని, ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది.

ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఎంత పెంచినా ఒక సీసా కనీసం రూ. 10 పెరుగుతుంది. ఎందుకంటే మద్యం అమ్మకాల్లో రూ.10 రౌండాఫ్‌ విధానం ఉంది. ప్రస్తుత ధరలు అందుకు అనుగుణంగా చివరిలో సున్నాతో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక రూపాయి పెంచినా.. అది 10 రూపాయలు అవుతుంది. మద్యం నిషేధించబోతున్నామని ప్రభుత్వ ప్రకటించడంతో ఆదాయం కూడా తగ్గించుకుంటుందని అందరూ భావించారు. కాని అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. గతేడాది ఎక్సైజ్‌ ఆదాయం రూ.6220 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8517 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు నెలల నుంచి చీప్‌ లిక్కర్‌ ధర పెరిగింది. దీంతో మద్యం వ్యాపారులు బ్రాండ్ మిక్సింగ్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..